NTV Telugu Site icon

Vana Mahotsavam: వన మహోత్సవం.. మొక్కలు నాటి ప్రారంభించిన సీఎం, డిప్యూటీ సీఎం..

Vana Mahotsavam

Vana Mahotsavam

Vana Mahotsavam: మంగళగిరి ఎకో పార్కులో వన మహోత్సవాన్ని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లు కలిసి ప్రారంభించారు. ఎకో పార్కులో మొక్కలు నాటి వన మహోత్సవాన్ని ప్రారంభించారు. ఎకో పార్కుకు చేరుకున్న సీఎం చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌లు స్వాగతం పలికారు. చెట్ల మధ్య డిప్యూటీ సీఎం, కేంద్రమంత్రితో కలిసి సీఎం చంద్రబాబు నడిచారు. ప్రశాంతమైన వాతావరణం, స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటున్నామని చంద్రబాబు అన్నారు. చెట్లు.. మొక్కల జాతులను అడిగి సీఎం, డిప్యూటీ సీఎం తెలుసుకున్నారు. ఎకో పార్కులో ఏర్పాటు చేసిన వివిధ పక్షి జాతుల ఫొటోలను తిలకించారు.

Read Also: Andhra Pradesh: ఏపీలో పలువురికి నాన్ కేడర్ ఎస్పీలుగా పదోన్నతులు, పోస్టింగులు

ప్రకృతిని.. చెట్లను చూసి జీవితాన్ని మలుచుకోవాలని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఓ చిన్న విత్తనం నెమ్మదిగా ఎదుగుతూ మహా వృక్షం అవుతుందన్నారు. విత్తనం ఎప్పుడూ కాంతి వైపు.. ప్రగతి వైపే పయనిస్తుందని ఆయన చెప్పారు. ఓ విత్తనం.. మహా వృక్షంగా ఎదిగిన తీరులోనే చంద్రబాబు జీవితం ఉంటుందన్నారు. యువత, విద్యార్థులు ప్రకృతిని, చెట్లని చూసి స్ఫూర్తి పొందాలని కేంద్ర మంత్రి సూచించారు.

Show comments