Site icon NTV Telugu

CM Chandrababu: టీడీపీ కార్యకర్త ఆకుల కృష్ణ మృతికి సీఎం సంతాపం!

Cm Chandrababu

Cm Chandrababu

రాజమండ్రి రూరల్ నియోజకవర్గం మోరంపూడి జంక్షన్‌కు చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఆకుల కృష్ణ మృతికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. పార్టీ ఒక విలువైన కార్యకర్తను కోల్పోయిందని సీఎం అన్నారు. తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడుకి వీరాభిమానిగా ఉన్న కృష్ణ.. క్యాన్సర్ బారిన పడి ఈరోజు మృతి చెందారు.

Also Read: Jasprit Bumrah: బుమ్రానే అతడికి సరైన మొగుడు.. ఇప్పటికి పదిహేనోసారి!

కొద్దిరోజుల క్రితం తన ఆరోగ్యం క్షీణిస్తున్న సమయంలో ఒకసారి తన అభిమాన నేత చంద్రబాబు నాయుడును చూడాలని ఆకుల కృష్ణ ఆకాంక్షించారు. ఆయన కోరికను తెలుసుకున్న సీఎం చంద్రబాబు.. స్వయంగా వీడియో కాల్ చేసి కృష్ణతో మాట్లాడారు. ఆరోగ్య పరిస్థితిపై బాబు అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని, అన్ని విధాలా తాను అండగా ఉంటానని కృష్ణకు భరోసా ఇచ్చారు. వృద్ధాప్యంలో క్యాన్సర్‌తో పోరాడిన కృష్ణ ఈరోజు మృతి చెందారు. ఆయన మృతిపై సీఎం తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

Exit mobile version