మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల పర్యటనకు సీఎం చంద్రబాబు నాయుడు బయల్దేరారు. ముఖ్యమంత్రి హెలికాప్టర్ ద్వారా ఏరియల్ విజిట్ చేయనున్నారు. బాపట్ల, పల్నాడు, కృష్ణా, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్ విజిట్ చేస్తారు. చిలకలూరిపేట, పర్చూరు, చీరాల, కోడూరు, నాగాయలంక మీదుగా ఓడలరేవు వరకు విజిట్ చేయనున్నారు. కోనసీమ జిల్లా, అల్లవరం మండలం ఓడలరేవులో సీఎం ల్యాండ్ అవనున్నారు. ఓడల రేవు నుంచి రోడ్డు మార్గాన ప్రయాణించి వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను సీఎం చంద్రబాబు పరిశీలించనున్నారు.
మొంథా తుఫాను బాధితులకు ఆర్థికసాయం అందించేెందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పునరావాస కేెంద్రాలకు వచ్చిన బాధితులకు ఆర్థిక సాయం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. బాధితుడికి వెయ్యి రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించింది. కుటుంబంలో ముగ్గురు కంటే ఎక్కువ ఉన్నా గరిష్టంగా 3వేలు సాయం అందివ్వాలని పేర్కొంది. బాధితులు పునరావాస కేంద్రం నుంచి ఇళ్లకు వెళ్లే ముందు 3వేలు ఆర్థిక సాయం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు విపత్తు నిర్వహణ శాఖ స్పెషల్ సీఎస్ సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.
