CM Chandrababu: ‘ఉత్తరాంధ్ర’ ఇక నుంచి ‘ఉక్కు ఆంధ్ర’: సీఎం చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని పారిశ్రామిక హబ్‌గా మార్చే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భారీ అడుగు వేశారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో సుమారు రూ.1.36 లక్షల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్న ‘ఆర్సెలార్ మిట్టల్ – నిప్పన్ స్టీల్’ ప్లాంట్‌కు సోమవారం ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. “ఉత్తరాంధ్ర ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. ఇకపై ఉత్తరాంధ్ర అంటే కేవలం వెనుకబడిన ప్రాంతం కాదు.. అది ‘ఉక్కు ఆంధ్ర’గా పిలవబడుతుంది” అని రాసుకొచ్చారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రతి రంగంలో, ప్రతి ప్రాంతంలో విప్లవాత్మక మార్పు తీసుకువస్తామని ఆయన పేర్కొన్నారు.
READ ALSO: Vijawada : పట్టుబడిన ముగ్గురు యువకులకు ఉగ్రవాదులతో లింక్.. వెలుగులోకి కీలక విషయాలు..!
Also Read
- Tamil Nadu: కొత్త అసెంబ్లీ–సచివాలయం.. ఒకే చోట అన్ని ప్రభుత్వ శాఖలు.. సీఎం విజయ్ ప్రకటన
- Bareilly Viral Video: బురఖాలో ప్రియుడితో పట్టుబడిన భార్య.. నడిరోడ్డుపై భర్త వీరంగం..
- Vijay-Congress: ముందు మంచి ముఖ్యమంత్రి అవ్వండి.. విజయ్‌కు కాంగ్రెస్ సూచన
- Lord Ganesha: 66 కేజీల బంగారం, 335 కేజీల వెండి.. రూ.703 కోట్ల బీమా.. మహా గణపతి దివ్య దర్శనం ఇలా..
స్టీల్ సిటీగా నక్కపల్లి
ఆర్సెలార్ మిట్టల్ ప్లాంట్ కేవలం ఒక పరిశ్రమ మాత్రమే కాదని, ఇది ఈ ప్రాంతాన్ని ఒక పూర్తి స్థాయి ‘స్టీల్ సిటీ’గా మారుస్తుందని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఉక్కు రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అత్యున్నత స్థానానికి తీసుకెళ్లడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. రూ.1.36 లక్షల కోట్ల వ్యయంతో ఇది దేశంలోనే అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్‌గా ఇది అవతరించనుంది. ఈ ప్లాంట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 1 లక్ష మందికి పైగా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా. రెండు దశల్లో పూర్తయ్యే ఈ ప్రాజెక్టు ద్వారా ఏడాదికి 17.8 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2028 డిసెంబర్ నాటికి మొదటి దశ ఉత్పత్తి ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అందించిన పూర్తి సహకారం వల్లే ఇంతటి భారీ ప్రాజెక్టును రాష్ట్రానికి తీసుకురాగలిగామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
READ ALSO: Indian Spy Movies: సరిహద్దులు దాటిన ఇండియన్ సినిమా క్రేజ్.. పాక్‌లో మన సినిమాలదే హవా!
తాజావార్తలు
-
Tamil Nadu: కొత్త అసెంబ్లీ–సచివాలయం.. ఒకే చోట అన్ని ప్రభుత్వ శాఖలు.. సీఎం విజయ్ ప్రకటన
-
Bareilly Viral Video: బురఖాలో ప్రియుడితో పట్టుబడిన భార్య.. నడిరోడ్డుపై భర్త వీరంగం..
-
Vijay-Congress: ముందు మంచి ముఖ్యమంత్రి అవ్వండి.. విజయ్‌కు కాంగ్రెస్ సూచన
-
Lord Ganesha: 66 కేజీల బంగారం, 335 కేజీల వెండి.. రూ.703 కోట్ల బీమా.. మహా గణపతి దివ్య దర్శనం ఇలా..
-
White Shoes Cleaning Tip: వైట్ షూపై మొండి మరకలు పోవడం లేదా?.. రూ.10తో తెల్లటి బూట్లకు కొత్త లుక్..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!