NTV Telugu Site icon

CM Chandrababu : విశాఖను దోచేసిన దొంగలను వదిలే ప్రసక్తే లేదు

Chandrababu

Chandrababu

విశాఖపట్నం దార్లపూడి పోలవరం కెనాల్ దగ్గర ప్రజలతో సీఎం చంద్రబాబు ముచ్చటించారు. నార్త్ కొరియా లో నవ్వినా, ఏడ్చినా కొట్టే కిమ్ లాంటి జిమ్ మన రాష్ట్రంలో ఉన్నాడన్నారు. మనకు ఆర్థిక వెసులు బాటు కల్పించాల్సిన బాధ్యత ఎన్డీఏపై ఉందన్నారు. విశాఖ స్టీల్స్ ప్రైవేటీకరణ ను నేను ఒప్పుకున్నామని చెబుతున్నారన్నారు. గతంలో వాజపేయి హయాంలో ప్రైవేటీకరణ చేస్తాన్నప్పుడు అడ్డుకున్నాం, ఈ సారీ కాపడుతామని ఆయన వ్యాఖ్యానించారు. విశాఖ ను దోచేసిన దొంగలను వదిలే ప్రసక్తే లేదన సీఎం చంద్రబాబు అన్నారు. ప్రజా సేవకులు గా వచ్చాం వచ్చే పర్యటన నుంచి నా పర్యటనలో గ్రీన్ కార్పెట్ కూడా వేయొద్దు అన్నారు చంద్రబాబు. కార్పెట్ వేస్తె వాళ్లపై చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల్లో గోదావరి జిల్లాల తర్వాత అత్యధిక ఓట్లు, మెజారిటీ వచ్చింది ఉత్తరాంధ్ర నుంచే అని ఆయన వ్యాఖ్యానించారు.

అంతేకాకుండా..’రాక్షస పాలనను అంతమొందించి మమ్మల్ని గెలిపించారు, మిమ్మల్ని నిలబెట్టె బాధ్యత నాది. ఐదేళ్ల ముందు ఎలాంటి పనులు చేశామో అలానే ఉన్నాయ్. సుజల స్రవంతి నీ పూర్తి చేసుకుని గోదావరి నీళ్లు తెచ్చుకుంటే ఉత్తరాంధ్ర సస్యశ్యామలం అవుతుంది. దార్లపూడి అక్విడిక్ట్, అండర్ పాస్ కోసం ఈరోజే టెండర్లు పిలవాలని ఆదేశిస్తున్నా. వీలైనంత త్వరలో సుజల స్రవంతి నీ పూర్తి చేస్తాం. 800 కోట్లు ఖర్చు పెడితే 2.20 లక్షల ఎకరాలకు తాగునీరు ఇచ్చి జన్మ సార్థకం చేసుకుంటాం. వంశధార, గోదావరి, కృష్ణా , పెన్నా నదుల అనుసంధానం చేసి రాష్ట్రంలో నీటి కొరత లేకుండా చేస్తాం. రైతులకు న్యాయం చేయడం ఎన్ డీ ఏ ప్రభుత్వ లక్ష్యం. పోలవరం, అమరావతి, కుప్పం తర్వాత ఢిల్లీ వెళ్లి ఆర్థిక పరిస్థితులపై చర్చించి తర్వాత మొదటగా ఉత్తరాంధ్ర కు వచ్చా. ఎన్ డీ ఏ కు దేశంలో ఎక్కడా లేని ఘన విజయాన్ని రాష్ట్రంలో అందించారు. ఓట్లు వేశాం అని ఇంట్లో పడుకోకుండా దొంగ మాటలు చెప్పే వాళ్ళను తిరగనీయకుండా చూడండి.
వైఎస్ఆర్సీపీ చెప్పేవి అన్నీ అబద్ధాలే. మీ మనోభావాలకు అనుగుణంగా పాలన చేస్తాం. పెన్షన్ లను పెంచాం, మెగా డీ ఎస్ సీ ఇచ్చాం, ల్యాండ్ గ్రాబ్బింగ్ యాక్ట్ ను రద్దు. చేశాం. పెట్టుబడులు పెట్టే వాళ్ళు రాష్ట్రంలోని భూతం గురుంచి భయపడుతూ ఉన్నారు. ఆ భూతాన్ని నియంత్రించే భూత వైద్యులు ప్రజలే దాన్ని చూసుకుంటారు. రోడ్లపై ఉన్న గొయ్యల్లో వైఎస్ఆర్సీపీ నేతలను పూడ్చాలి. గొయ్యలపాలైన రాష్ట్రాన్ని ఏం చేయాలో తెలియడం లేదు.’ అని సీఎం చంద్రబాబు అన్నారు.