Site icon NTV Telugu

Arvind Kejriwal: నేను ఈడీ విచారణకు రాలేను.. అధికారులు కాస్త ఓపికతో ఉండండి

Arvindh

Arvindh

Arvind Kejriwal: లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ విచారణకు రాలేని చెప్పారు. దర్యాప్తు సంస్థ ఇచ్చిన సమన్లకు ఇవాళ ఆయన ఈడీ కార్యాలయానికి వెళ్లాల్సి ఉండగా.. తాను హాజరుకావడం లేదని సీఎం చెప్పారు. ఆయన ఇలా విచారణకు ఉమ్మా కొట్టడం ఇది ఏడోసారి. అయితే, ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉంది. ఇక, మార్చి 16న విచారణ కొనసాగుతుంది అని ఆమ్ ఆద్మీ పార్టీ వెల్లడించింది. దర్యాప్తు సంస్థ న్యాయ ప్రక్రియను గౌరవించాలని ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది. పదేపదే సమన్లు జారీ చేయడం సరికాదు.. కోర్టు ఆదేశాలు వచ్చే వరకు ఓపికతో వేచి ఉండాలని తెలిపింది.

Read Also: Mission Chapter 1 : ఓటీటీలోకి వచ్చేస్తున్న అమీ జాక్సన్ రీఎంట్రీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

ఇక, మద్యం కుంభకోణం కేసులో విచారణ కోసం జారీ చేసిన నోటీసులకు సీఎం కేజ్రీవాల్ స్పందించకపోవడంతో ఈడీ కొద్ది రోజుల క్రితం కోర్టును ఆశ్రయించింది. ఈ ఫిర్యాదుపై ఇటీవల న్యాయస్థానం నోటీసులు జారీ చేయడంతో కేజ్రీవాల్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణకు అటెండ్ అయ్యారు. అయితే, కేజ్రీవాల్ అభ్యర్థన మేరకు తదుపరి విచారణను మార్చి 16వ తేదీకి వాయిదా వేసింది. ఇదిలా ఉంటే.. లిక్కర్ స్కాం కేసులో ఇప్పటికే సీబీఐ కేజ్రీవాల్‌ను విచారణ చేసింది. గతేడాది ఏప్రిల్‌లో 9 గంటల పాటు ప్రశ్నించింది. తాజాగా ఈడీ నమోదు చేసిన కేసులోనూ వరుసగా సమన్లు ఇస్తున్నారు. ఇక, ఇదే కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, ఆప్‌ ఎంపీ సంజయ్‌సింగ్‌ జైలులో ఉన్నారు.

Exit mobile version