NTV Telugu Site icon

Bhatti Vikramarka: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది.. 6 పథకాలను 100 రోజుల్లో అమలు చేస్తాం!

Mallu Bhatti Vikramarka

Mallu Bhatti Vikramarka

CLP Leader Mallu Bhatti Vikramarka Slams BRS: తెలంగాణలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే.. ఆరు పథకాలను వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పారు. రాష్ట్ర సంపద, వనరులను ప్రజలకు పంచుకోవడం కోసం తెచ్చుకున్న ప్రత్యేక తెలంగాణను.. దశాబ్ద కాలంగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పెద్దలు దోచుకుంటున్నారన్నారు. ఖమ్మం జిల్లా మధిర క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొన్న భట్టి విక్రమార్క బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

‘కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయ్యాలి అంటున్న మంత్రి కేటీఆర్.. ప్రజల్ని మోసం చేస్తూ రాష్ట్ర సంపదని దోచుకుంటున్న బీఆర్ఎస్‌కే ఎందుకు ఓటేయ్యాలో చెప్పాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఐదు లక్షల కోట్ల అప్పుల పాలు చేసింది. బడ్జెట్లో దళిత బంధు కింద 17 వేల 700 వందల కోట్ల నిధులు కేటాయించి సంవత్సరం అవుతున్నా.. ఇంకా ఎందుకు ఖర్చు పెట్టలేదు?. బడ్జెట్లో నిధులు కేటాయించకుండా.. గృహలక్ష్మి, బీసీలకు బీసీ బంద్ అంటూ కాగితాలు పంచుతూ బీఆర్ఎస్ పార్టీ ప్రజల్ని మోసం చేస్తున్నారు. ప్రజల్ని మోసం చేసేందుకు బీఆర్ఎస్ నాయకులు బయలుదేరారు. ప్రజలు అప్రమత్తంగా ఉండండి’ అని భట్టి విక్రమార్క అన్నారు.

Aslo Read: Telangana Assembly Elections 2023: ‘బస్సు యాత్ర’ తర్వాతే కాంగ్రెస్ అభ్యర్ధుల ప్రకటన?

‘రానున్న ఎన్నికలలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది. ఆరు పథకాలను వంద రోజుల్లో అమలు చేస్తాం. వామపక్షాలతో చర్చలు జరిగాయి కానీ సీట్ల కేటాయింపు ఇంకా జరగలేదు. వైఎస్ షర్మిల గారు సోనియా గాంధీతో సంప్రదింపులు జరిపారు. మాది జాతీయ పార్టీ.. పొత్తులపై జాతీయ స్థాయిలోనే నిర్ణయాలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా అధిష్టానమే ప్రకటిస్తుంది. సోషల్ మీడియాలో వస్తున్న కథనాలను నమ్మకండి’ అని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.