Site icon NTV Telugu

Bhatti Vikramarka : దేశాన్ని ఆదాని, అంబానీలకు మోడీ తాకట్టు పెడతున్నారు

Bhatti Vikramarka

Bhatti Vikramarka

CLP Leader Bhatti Vikramarka Fired on PM Modi

తెలంగాణలో కాంగ్రెస్‌పార్టీ నేతలు ఏఐసీసీ ఆదేశాల మేరకు 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆజాద్‌ కా గౌరవ్‌ పేరిట పాదయాత్ర నియోజకవర్గాల్లో పాదయాత్ర నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలోనే ఖమ్మం రూరల్ మండలం పెద్దతండ వద్ద రెండవ రోజు ఆజాద్ కా గౌరవ్‌ పాదయాత్రలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎందరో మహానుభావుల పోరాటంతో దేశానికి స్వాతంత్య్రం తెచ్చి ఆర్థిక వ్యవస్థ బలపర్చింది కాంగ్రెస్ పార్టీనే అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రాజెక్టును తీసుకవచ్చి సస్యశ్యామలం చేసిన ఘనత ఆనాటి కాంగ్రెస్ పార్టీదేనని ఆయన తెలిపారు.

దేశాన్ని ధనికులు ఆదాని, అంబానీలకు నరేంద్రమోదీ తాకట్టు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. పోరాటం చేసి దేశ సంపదను కాపాడుకోవసిన పరిస్థితి నెలకొందని, స్వాతంత్ర్యం తీసుకొచ్చిన గాంధీని భారతీయ జనతా పార్టీ హత్య చేసిందన్నారు. మరోకాయన జాతిపిత అని చెప్పుకుంటూ గాంధీని చంపిన నాయకుడికి వత్తాసు పలుకుతున్నారన్నారు. మనకోసం పోరాటం చేసిన కాంగ్రెస్ పార్టీని గుర్తు చేసుకొండని ఆయన అన్నారు. ఆజాద్‌ కా గౌరవ్‌ యాత్ర ఉద్దేశ్యం స్వతంత్రం కోసం పోరాటం చేసిన వాళ్ళను గౌరవించుకోవడమని ఆయన అన్నారు.

 

Exit mobile version