What is a CloudBurst: ఎలాంటి సంకేతాలు గానీ, హెచ్చరికలు లేకుండా.. మేఘాలు ప్రళయం సృష్టించడంను ‘క్లౌడ్ బరస్ట్’ అంటారు. సాధారణంగా వర్షాలు పడేటపుడు మేఘాలు ఉరుముతుంటాయి. దీంతో చాలా మంది అలర్టై అక్కడ నుంచి సేఫ్‌గా ఉన్న ప్రాంతానికి వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. కానీ ఈ క్లౌడ్ బరస్ట్ అలా కాదు. ఎలా వస్తుందో.. ఎప్పుడో కూడా తెలియకుండా వస్తుంది. మేఘాలు గర్జించి, విస్ఫోటనాలై పేలిపోతూ.. క్లౌడ్ బరస్ట్ రూపంలో ప్రళయం సృష్టిస్తాయి.
ఒక్క మాటలో క్లౌడ్ బరస్ట్ అంటే ఏంటో చెప్పాలంటే.. అతి కొద్ది ప్రాంతంలో కుండపోత వర్షం పడడం. ఒక గంటలో 10 సెంటీమీటర్ల కుండపోత వర్షం 30 ఘనపు కిలో మీటర్ల వైశాల్యంలో మాత్రమే కురిస్తే దాన్ని క్లౌడ్ బరస్ట్ అంటారు. ఈ క్లౌడ్ బరస్ట్ కు కారణాలేంటంటే.. గాలి స్వల్పంగా వేడేక్కడం, గాలిలో తేమ పెరిగి ఆకాశం వైపు ప్రయాణించి, మేఘాలు అవక్షేపం చెంది కుండపోతగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ క్లౌడ్ బరస్ట్‌లను ముందస్తుగా అంచనా వేయడం సాధ్యం కాదని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. కానీ వీటిని ఎలా తట్టుకోవాలో, ఈ విస్పోటనాల వల్ల వచ్చే నష్టాలను నివారించే చర్యలను తీసుకోవచ్చని వెల్లడించారు.
Also Read: Pawan Kalyan: పండగ పూట విషాదం.. స్పందించిన డిప్యూటీ సీఎం పవన్!
గత వారం రోజులుగా కాశ్మీర్‌లో కురిసిన భారీ వర్షాలకు తోడు క్లౌడ్ బరస్ట్ ఏర్పడింది. దీంతో 60 మంది ప్రాణాలు కోల్పోవడంతో పాటు 500 మంది అచూకీ కనపడకుండా పోయింది. వేలమంది గాయపడ్డారు. మరోవైపు కొండ చరియలు విరిగిపడి ఇండ్లన్నీ కూలిపోయాయి. దీంతో ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. ఎత్తైన పర్వత శ్రేణులు ఉండడం కూడా ఈ క్లౌడ్ బరస్ట్‌లకు కారణమవుతున్నాయి. వాతావరణ సగటు ఉష్ణోగ్రత ఒక డిగ్రీ పెరిగినపుడు.. గాలి 7 శాతం అధికంగా తేమను కలిగి ఉండడంతో భారీ వర్షాలు కురిసే అవకాశం పెరుగుతుంది. పర్వత ప్రాంతాల్లో అభివృద్ధి పేరుతో అస్తవ్యస్థ పట్టణీకరణ, అడవులను విచక్షణా రహితంగా నరికివేయడం, చిత్తడి నేలలు తగ్గిపోవడం, భూమిలోని నీరు ఇంకి పోవడాన్ని నిరోధించడం వంటివి క్లౌడ్ బరస్ట్‌లకు కారణమవుతున్నాయి.
