Muslim weddings: జార్ఖండ్‌లోని ధన్‌బాద్ జిల్లాలోని ఒక బ్లాక్‌లో ముస్లిం వివాహాలలో నృత్యం, సంగీతం, బాణసంచా కాల్చడాన్ని మతాధికారులు నిషేధించారు. డిసెంబర్ 2 నుంచి ఆంక్షలు ప్రారంభమవుతాయని నిర్సా బ్లాక్‌లోని సిబిలిబడి జామా మసీదు హెడ్ ఇమామ్ మౌలానా మసూద్ అక్తర్ సోమవారం తెలిపారు. వివాహాల సమయంలో నృత్యం, సంగీతంతో పాటు బాణాసంచా కాల్చడం వంటి ఇస్లామిక్ వ్యతిరేక పద్దతులను నిషేధిస్తున్నట్లు ముస్లిం మతపెద్దల బృందం నిర్ణయం తీసుకుంది. ఆ ఆదేశాలను ఉల్లంఘించే వారిపై జరిమానా విధించబడుతుందని పేర్కొన్నారు.
Monkeypox: మంకీపాక్స్‌కు కొత్త పేరు.. ఏమిటో తెలుసా?
“ఇస్లామిక్ మతం ప్రకారం వివాహం జరగాలని మేము ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నాము. నృత్యం, డీజే, బాణాసంచా ప్రదర్శనలు ఉండవు. ఆర్డర్‌ను ఉల్లంఘించిన వారికి రూ. 5,100 జరిమానా విధించబడుతుంది’ అని బిలిబడి జామా మసీదు హెడ్ ఇమామ్ మౌలానా మసూద్ అక్తర్ తెలిపారు. “ఇటువంటి పద్ధతులు ఇస్లాంలో అనుమతించబడవు. ఇవి కూడా ప్రజలకు అసౌకర్యాన్ని కలిగిస్తాయి, ”అని నిర్ణయం తీసుకున్న ఆదివారం సమావేశానికి అధ్యక్షత వహించిన హెడ్ ఇమామ్ చెప్పారు. రాత్రి 11 గంటలలోపు వివాహం జరిపించాలని అక్తర్ చెప్పాడు. “రాత్రి 11 గంటల తర్వాత ఎవరైనా వివాహం చేయడానికి ప్రయత్నిస్తే జరిమానా విధించబడుతుంది. నిబంధనలను ఉల్లంఘించిన వారు రాతపూర్వకంగా క్షమాపణలు కూడా చెప్పవలసి ఉంటుంది” అని ఆయన అన్నారు. ఈ నిర్ణయాన్ని వారి బంధువులతో పంచుకోవాలని మతగురువు సంఘం సభ్యులకు విజ్ఞప్తి చేశారు.