Site icon NTV Telugu

UP: అజ్మీర్ మసీదులో మతపెద్ద హత్య.. పోలీసుల దర్యాప్తు

He

He

రాజస్థాన్‌లోని అజ్మీర్ మసీదులో మత పెద్ద హత్యకు గురయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించి దర్యాప్తు చేపట్టారు. మృతుడు ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌కు చెందిన వాసిగా పోలీసులు గుర్తించారు. అజ్మీర్‌లోని దౌరాయ్ ప్రాంతంలో ఉన్న మసీదులో శనివారం ఉదయం ఒక మత గురువు హత్యకు గురైనట్లు అధికారి తెలిపారు. తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో ఈ హత్య జరిగినట్లుగా వెల్లడించారు. సంఘటన జరిగిన సమయంలో మసీదు కాంప్లెక్స్‌లో ఆరుగురు మైనర్ పిల్లలు ఉన్నట్లు చెప్పారు. ఇప్పుడే వీరే సాక్షులుగా ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే ముగ్గురు వ్యక్తులు ముసుగులు ధరించి దాడికి పాల్పడినట్లుగా ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు తేల్చారు. అంతేకాకుండా సమీపంలో ఉన్న సీసీ కెమెరాల పుటేజీని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి:Harirama Jogaiah Letter: జోగయ్య మరోలేఖ.. ఆ నినాదం నిజం కావాలంటే.. కాపుల ఓట్లే కీలకం..

Exit mobile version