Clay Pot Breaks Down After a woman Try to Cook in it On Gas Stove: ప్రస్తుతం సోషల్ మీడియా, యూట్యూబ్ వినియోగం పెరిగిపోయిన తరువాత వాటిని చూసి కొంత మంది రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. ఇక వంటల విషయంలో అయితే ఆ ప్రయోగాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. అయితే కొన్ని సార్లు ఇలాంటి ప్రయోగాలు బెడిసి కొడుతూ ఉంటాయి. లక్ బాగోలేకపోతే ప్రమాదం కూడా జరిగి ఆసుపత్రి పాలయ్యే అవకాశం కూడా ఉంటుంది. అటువంటి ఓ వీడియోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Also Read: Viral Video: వాటిని అలా కూడా దాస్తారా? కొత్తగా కొన్న ఇంటి గోడలో ఉన్నది చూసి షాకైన ఓనర్
ప్రస్తుతం ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే ట్రెండ్ నడుస్తుందనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు మళ్లీ పాత కాలం నాటి వస్తువులు, ఆభరణాలు, స్టైల్స్ ను ఫాలో అవుతున్నారు జనాలు. ఇక ఆరోగ్యం కూడా జనాలకు ఈ మధ్య శ్రద్ద ఎక్కువయ్యిపోయింది. ఆరోగ్యం ఉండటం కోసం ప్లాస్టిక్ ను వాడటం మానేస్తున్నారు. వాటి స్థానంలో పాత కాలంలో వాడిన మట్టిపాత్రలు, ఇత్తడి వస్తువులు, కాపర్ లాంటివి ఉపయోగిస్తున్నారు. ఇదిలా వుండగా మట్టి పాత్రలో వంట చేయాలనుకున్న ఓ యువతికి అనూహ్య ఘటన ఎదురయ్యింది. వంట చేయడానికి పెట్టిన మట్టి పాత్ర ఒక్కసారిగా పగిలింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ వీడియోలో మొదట ఫర్హా అఫ్రీన్ అనే అమ్మాయి వంట చేయడానికి ఓ మట్టిపాత్రను గ్యాస్ స్టవ్ మీద ఉంచుతుంది. అనంతరం దానిలో నెయ్యి వేసి అది మరిగాక పోపు వేయాలనుకుంటుంది. అయితే ఉన్నట్టుండి ఆ మట్టి పాత్ర పేలి పోతుంది. దీంతో ఆ యువతి షాక్ కు గురవుతుంది. ఇలాంటి ప్రయోగాలు చేసేటప్పుడు జాగ్రత్త అంటూ క్యాప్షన్ జోడించి ఆ యువతి ఈ వీడియోను పోస్ట్ చేసింది. అయితే ఈ ఘటనలో ఆ యువతికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. అయితే ఇది చూసిన నెటిజన్లు మట్టి పాత్రల్లో ఎలా పడితే అలా వంట చేయకూడదని సూచిస్తున్నారు. కొంతమంది వంట చేయడానికి వాడే మట్టి పాత్రలు వేరుగా ఉంటాయంటూ కామెంట్ చేస్తున్నారు.