West Bengal Student Murder: మనుషుల ప్రాణాలకు విలువ లేకుండా పోతుంది. ఏ దోమనో, చీమనో చంపినంత ఈజీగా మనుషుల ప్రాణాలు తీసేస్తున్నారు. చిన్న, పెద్ద తేడా లేకుండా ఏ వయసువారైనా బెదురు లేకుండా ప్రాణాలు తీసేస్తున్నారు. శిక్ష గురించి భయపడటం లేదు, పాపం పుణ్యం అని ఆలోచించడం లేదు. ఇక మానవ్వతం అయితే మచ్చుకైనా కనిపించడం లేదు. టెక్నాలజీ పెరిగే కొద్దీ ఆలోచనా విధానం ఉన్నతంగా మారాలి. కానీ ఇప్పుడు యూట్యూబ్ లు, సినిమాలు, సీరియల్స్ చూసి హత్యలు కూడా చాలా ఈజీగా చేసేస్తున్నారు. ఆన్ లైన్ గేమింగ్ కోసం అయితే కొంత మంది ప్రాణాలు తీసేకుంటున్నారు లేదా ఇతరుల ప్రాణాలు తీసేస్తున్నారు. తాజాగా పశ్చిమ బెంగాల్ లో తన తోటి స్నేహితుడిని డబ్బల కోసం చంపేశారు 8 వ తరగతి చదువుతున్న విద్యార్థులు.
Also Read: Gang Rape: దారుణం.. మహిళా గార్డుపై గ్యాంగ్ రేప్
పశ్చిమ బెంగాల్ నడియా జిల్లాలో దారుణం జరిగింది. తమ తోటి స్నేహితుడినే డబ్బుల కోసం కిడ్నాప్ చేసి హత్య చేశారు ముగ్గురు 8 వ తరగతి విద్యార్థులు. తమ కొడుకు స్నేహితులను కలవడానికి వెళ్లి తిరిగి రాలేదని అతని తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులు ముగ్గురును అరెస్ట్ చేశారు. ఇక ముగ్గురు విద్యార్థులు తమ స్నేహితుడిని రమ్మని పిలిచారు. దీంతో ఆ బాలుడు శుక్రవారం సైకిల్ తో స్నేహితుల వద్దకు వెళ్లాడు. వారు అతడిని కిడ్నాప్ చేసి ఇంట్లో వారికి కాల్ చేసి మూడు లక్షలు కావాలని డిమాండ్ చేశారు. లేదంటే వారి కొడుకును చంపేస్తామని బెదిరించారు. ఆ వచ్చిన డబ్బుతో ఒక గేమింగ్ ల్యాప్ టాప్ కొనాలని వారు ఫథకం వేశారు. అయితే డబ్బులు ఇచ్చేందుకు బాలుడి ఇంటిలోని వారు నిరాకరించారు.దీంతో ఆ ముగ్గురు కలిసి స్నేహితుడని కూడా చూడకుండా బాలుడిని చంపేశారు. అయితే చంపేముందు బాలుడి చివరి కోరికను అడిగి అతడికి రసగుల్లాలు, కూల్ డ్రింక్ తినిపించి మరీ చంపేశారు. చిన్న పిల్లలు ఇంతటి దారుణానికి పాల్పడటంతో అక్కడ ఉన్న వారందరూ షాక్ కు గురయ్యారు. ఇప్పుడే ఇలా ఉన్నారంటే పెద్దయ్యాక ఎంతటి దారుణానికి పాల్పడతారో అని భయపడుతున్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ ముగ్గురుని అరెస్ట్ చేసిన పోలీసులు జువెలిన్ కోర్టుకు హాజరుపరిచారు.