Site icon NTV Telugu

IPL 2023: శతకంతో చెలరేగిన క్లాసెన్.. ఆర్సీబీ టార్గెట్ ఎంతంటే..?

Klassen

Klassen

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ 16లో భాగంగా మ్యాచ్ నెంబర్ 65లో ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడుతుంది. టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ ఆర్సీబీకి చాలా కీలకం. ప్లే ఆఫ్స్ కు చేరాలంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ మ్యాచ్ లో తప్పని సరిగా గెలవాల్సిందే.హెన్రిచ్ క్లాసెన్ దూకుడుగా ఆడడంతో 49 బంతుల్లోనే శతకం బాదాడు. తన ఇన్సింగ్స్ లో 8 ఫోర్లు, 6 సిక్స్ లతో ఆకాశామే హద్దుగా చెలరేగిపోయాడు. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. ఎస్ ఆర్ హెచ్ టీమ్ లో క్లాసెన్ ఒక్కడే అసాధరణమైన బ్యాటింగ్ తో ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. దీంతో రాయల్ ఛాలెంజర్స్ కు భారీ టార్గెట్ ను ఇచ్చింది.

Also Read : Siddaramaiah: సీఎల్పీ లీడర్ గా సిద్దరామయ్య ఎన్నిక.. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ ఆహ్వానం

ఇక.. టాస్ ఓడిన స‌న్‌రైజ‌ర్స్ హైదరాబాద్ టీమ్ బ్యాటింగ్‌కు దిగింది. అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠిలు ఓపెన‌ర్లుగా క్రీజులోకి వచ్చారు. మొద‌టి ఓవ‌ర్‌కు మహ్మద్ సిరాజ్ బౌలింగ్ చేశాడు. ఫస్ట్ ఓవర్ కుస‌న్‌రైజ‌ర్స్ హైదరాబాద్ జట్టు స్కోరు 2/0. మైకేల్ బ్రేస్‌వెల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌కు గ‌ట్టి షాక్ ఇచ్చాడు. ఒకే ఓవ‌ర్‌లో ఓపెన‌ర్లు ఇద్దరినీ అవుట్ చేశాడు. ఐదో ఓవ‌ర్ వేసిన బ్రేస్ వెల్ మొద‌టి బంతికి అభిషేక్ శ‌ర్మ(11)ను పెవిలియన్ కు పంపించగా.. మూడో బంతికి రాహుల్ త్రిపాఠి(15)ని డగౌట్ కి పంపించాడు. అభిషేక్ శ‌ర్మ క్యాచ్ ను మహిపాల్ లోమ్రోర్ అందుకోగా, త్రిపాఠి.. హ‌ర్షల్ ప‌టేల్ చేతికి చిక్కాడు. దీంతో 28 ప‌రుగుల‌కే సన్ రైజర్స్ హైద‌రాబాద్ రెండు వికెట్లు కోల్పోయింది.

Also Read : New Cities Across India: భారతదేశం అంతటా కొత్తగా 8 నగరాల ఏర్పాటు..కేంద్రం పరిశీలన

ఇక ఆర్సీబీ బౌలర్ షాబాజ్ ఆహ్మద్ 12 ఓవర్లో బౌలింగ్ లో ఐదో బంతికి ఎస్ ఆర్ హెచ్ కెప్టెన్ మార్క్రమ్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో 104 పరుగులకే కీలకమైన మూడు వికెట్లను సన్ రైజర్స్ కోల్పోయింది. ఒక బ్యాటింగ్ కి వచ్చిన హ్యారీ బ్రూక్ తో కలిసి క్లాసెన్ మరో కీలకమైన భాగస్వామ్యాన్ని నిర్మించారు. ఇక హెన్రిచ్ క్లాసెన్ 51 బంతుల్లో 104 పరుగులు చేసి మంచి ఊపుమీద కనిపించాడు.. కానీ హర్షల్ పటేల్ బౌలింగ్ లో (18.5 ఓవర్లో ) బాల్ కి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 178 పరుగుల వద్ద క్లాసెన్ పెవిలియన్ కు బాట పట్టాడు. చివరి ఓవర్ లో సూపర్ గా బౌలింగ్ చేసిన సిరాజ్ మియా కేవలం 4 పరుగులు రావడంతో ఎస్ ఆర్ హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 186 పరుగులు చేసింది. ఇక ఆర్సీబీకి టార్గెట్ 187 పరుగుల ఇచ్చింది.

Exit mobile version