NTV Telugu Site icon

Student Letter: తెలంగాణ సీఎంకు 5వ తరగతి విద్యార్థిని లేఖ.. ఎందుకో తెలుసా..!

Student Letter

Student Letter

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి 5వ తరగతి చదవుతున్న విద్యార్థిని లేఖ రాసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలంటూ.. అంజలి అనే విద్యార్థిని సీఎంను లేఖలో కోరింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆధిబట్లకు చెందిన విద్యార్థిని అంజలి.. “గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి నమష్కరించి వ్రాయునది.. సీఎంగా మీరు ఎన్నికైనందుకు శుభాకాంక్షలు. దయచేసి మా ప్రభుత్వ స్కూలుకు ఉచిత విద్యుత్ అందించాలని మనవి” అని లేఖ రాసి పోస్ట్ చేసింది. తన పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత కరెంట్ అందించాలంటూ రేవంత్ రెడ్డికి లేఖ ద్వారా తన సందేశాన్ని తెలియజేసింది.

Read Also: Hyderabad: ప్రాణం తీసిన పాత కక్షలు.. కులుసుంపుర పరిధిలో దారుణ హత్య

అయితే విద్యార్థిని అంజలి రాసిన లేఖ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఎన్నికల సమయంలో ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత కరెంటు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఉచిత కరెంటును స్కూళ్లకు ఇవ్వాలంటూ లేఖ రాయడం పట్ల ఆ విద్యార్ధినిని అందరూ అభినందిస్తున్నారు.

Read Also: Bharat Bandh: రేపు భారత్ బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టులు..