NTV Telugu Site icon

TS BJP : వైరా నియోజకవర్గంలో బీజేపీ కార్యకర్తలు బాహాబాహీ

Bandi Sanjay Bjp

Bandi Sanjay Bjp

ఖమ్మం జిల్లాలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన సందర్భంగా జనసమీకరణ కోసం జరుగుతున్న వైరా నియోజకవర్గ సన్నాక సమావేశంలో పార్టీలో ఉన్న వర్గ విధాలు బయటపడ్డాయి. వైరా నియోజకవర్గ కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఖమ్మం జిల్లా వైరాలోని పరుచూరి గార్డెన్ జరిగిన బిజెపి ముఖ్య కార్యకర్తల సన్నాహాక సమావేశంలో మాజీ రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్ రావు సమక్షంలోనే గొడవకు కార్యకర్తలు దిగారు.

Also Read : YSRCP vs BJP: ఏపీలో హీటెక్కిన రాజకీయం.. బీజేపీ వర్సెస్ వైసీపీ..!

పార్టీలో సరియైన ప్రాధాన్యత ఇవ్వటం లేదని సమాచార కూడా చెప్పడం లేదని ముఖ్య నాయకుల ఎదుట అసహనం వ్యక్తం చేశారు.మాజీ రాజ్యసభ సభ్యుడు వెళ్లిపోగానే బాహాబాహీకి దిగారు. బీజేపీ వైరా నియోజకవర్గం కో కన్వీనర్ నెల్లూరు కోటేశ్వరావుపై కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్యాం సుందర్ నాయక్ వర్గానికి ప్రాధాన్యం ఇస్తున్నారంటూ మిగిలిన వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరిపై ఒకరు తోచుకుంటూ దాడులు చేసుకోవడానికి ప్రయత్నం చేశారు.

Also Read : Man Kills Neighbour: దారుణం.. మద్యం తాగేందుకు పిలిచి మర్డర్ చేశాడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?