NTV Telugu Site icon

Fight In Marriage: చుక్కేసి.. ముక్కకోసం గొడవ.. పెళ్లిలో ఇరువర్గాలు ఘర్షణ..!

Penbirthy Marrige News

Penbirthy Marrige News

Fight In Marriage: వివాహ వేడుకలో వింత ఘటన చోటుచేసుకుంది. ముక్క కోసం ఇరువర్గాలు దాడి చేసుకోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులకు ఈవార్త చేరడంతో.. రంగంలోకి దిగిన పోలీసులు 16 మందిపై కేసు నమోదు చేశారు. పెళ్లి విందు వివాదాస్పదంగా మారిన ఘటన జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం ఆత్మకూరులో చోటుచేసుకుంది.

వేములవాడకు చెందిన అబ్బాయితో ఆత్మకూరుకు చెందిన ఓ యువతికి పెళ్లి ఫిక్స్ అయ్యింది. పెళ్లికూతురు ఇంట్లోనే అంగరంగ వైభవంగా వివాహం కూడా జరిగింది. పెళ్లికి హాజరైన వధువు బంధువులు, స్నేహితులందరికీ వధువు కుటుంబ సభ్యులు విందు ఏర్పాటు చేశారు. మటన్ కర్రీ, బగరా రైస్ అతిథులకు వడ్డించడం వల్ల మర్యాదకు లోటు రాకుండా చేశారు. అయితే మద్యం మత్తులో కొందరు చేసిన గొడవ ఘర్షణకు దారితీసింది. మద్యం మత్తులో భోజనానికి వచ్చిన పెళ్లికొడుకు బంధువులకు భోజనానికి సరిపడా మటన్ కూర అయిపోయిందని వధువు బంధువులు చెప్పడంతో మద్యం మత్తులో వరుడి బంధువులు గొడవకు దిగారు. వంట సామాగ్రి, టేబుళ్లను ఎత్తుకెళ్లి వడ్డిస్తున్న వారిపై దాడి చేశారు.

Read also: Viral Video: వాటే క్రియేటివిటీ.. పానీ పూరిపై ఆర్టిస్ట్ క‌ళాకృతి సూపర్..!

దీంతో వధూవరుల బంధువులు పరస్పరం గొడవపడగా, వధువు బంధువుల్లో ఇద్దరికి గాయాలయ్యాయి. పెళ్లి వేడుక రణరంగంగా మారింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి మూడంచెల బంధంతో ఏడడుగులు వేసిన నవ వధువును వేములవాడకు పంపించారు. విందులో ఇరువర్గాలు ఘర్షణ పడడంతో మెట్ పల్లి పోలీసులు 16 మందిపై కేసు నమోదు చేశారు. బాలిక బంధువు దుద్దుల తిరుపతి ఫిర్యాదు మేరకు వేములవాడకు చెందిన బాలుడి బంధువులు ఏడుగురిపై, ఆత్మకూరుకు చెందిన బాలిక బంధువులు 9 మంది, వేములవాడకు చెందిన బాలుడి బంధువు నరవరాజుపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ చిరంజీవి తెలిపారు. మద్యం మత్తులో గొడవపడి ఒకరినొకరు కొట్టుకుని కటకాలు లెక్కపెట్టే పరిస్థితి తలెత్తడంతో వధూవరుల తల్లిదండ్రులు రాజీ పనుల్లో నిమగ్నమయ్యారు. కాగా.. మొత్తానికి మద్యం మత్తులో మటన్‌ కోసం కొట్లాటకు దిగి గాయపడి.. పోలీస్ స్టేషన్‌ ముందు పడిగాపులు పడాల్సి వచ్చింది.
Pemmasani Chandrasekhar: వైసీపీపై పెమ్మసాని ఫైర్.. అది నిజమా? కాదా..?