NTV Telugu Site icon

TDP vs YCP Tension: పల్నాడులో టెన్షన్.. టీడీపీ- వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ.. ఈసీ కీలక నిర్ణయం!

Palnadu

Palnadu

TDP-YCP Clash in Palnadu: పల్నాడు జిల్లాలో పలు చోట్ల తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. పోలింగ్‌కు ముందే టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ కొనసాగుతుంది. రెంటాల, పాకాలపాడు, దూళిపాళ్ల, దాచేపల్లి, అచ్చంపేట, గురజాల గ్రామాల్లో పరస్పరం రాళ్లు, కర్రలతో దాడులు చేసుకుంటున్నారు. దీంతో ఈ ఘటనపై ఎలక్షన్ కమిషన్ ఆరా తీసింది. వెంటనే పరిస్థితిని అదుపు చేయాలని పోలీసులను ఆదేశాలను జారీ చేసింది. అవసరమైతే కేంద్ర బలగాలను అక్కడికి తరలించాలని సూచనలు చేసింది. అటు రెంటాడలో పోలింగ్ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయినట్లుగా సమాచారం.

Read Also: Canada: కెనడా చరిత్రలోనే అతిపెద్ద బంగారం దోపిడి కేసులో మరో భారత సంతతి వ్యక్తి అరెస్ట్..

ఈ ఘర్షణ నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల్లోకి టీడీపీ ఏజెంట్లు వెళ్లడం లేదు. తమపై దాడులు చేస్తున్నారంటూ రోడ్డుపై బైఠాయించి ఆందోనళ చేస్తున్నారు. దీంతో పోలింగ్ ప్రక్రియపై టెన్షన్ కొనసాగతోంది. కాగా, ఈ ఘటనపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఇరు పార్టీలు ప్రశాంతంగా ఓటింగ్ జరిగేలా చూడాలని ఈసీ తెలిపింది. ఇక, పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరగేలా చూడాలంటూ పోలీస్ శాఖకు ఆదేశాలు ఇచ్చింది. అవసరమైతే కేంద్ర బలగాల సహాయం తీసుకోవాలని చెప్పుకొచ్చింది.