Andhra Pradesh Crime: ఏ సమయానికి జరగాల్సింది ఆ సమయానికి జరగాలన్నారు పెద్దలు.. కానీ, కొన్ని కోయిలలు ముందే కూస్తున్నాయి.. సినిమాలు, టీవీలో కార్యక్రమాలు, సోషల్ మీడియా ప్రభావంతో.. ఏ ఏజ్‌లో లవ్‌లో పడుతున్నారో కూడా తెలియని పరిస్థితి.. అంతేకాదు ఓ అమ్మాయితో ఇద్దరు, ముగ్గురు లవ్‌లు పడుతున్నారు.. అంతేకాదు.. ఫైటింగ్ చేస్తున్నారు.. దాడి చేయడానికి కూడా వెనుకాడడం లేదు.. తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన ఓ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Read Also: Pithani Satyanarayana: జనసేన, టీడీపీ పొత్తుపై మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. ఎంత కాలం అడ్డుకుంటారు..?
రాజానగరం జిల్లా పరిషత్ హై స్కూల్ 9 తరగతి విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఓ అమ్మాయితో ప్రేమ వ్యవహారమై 9 తరగతి చదువుతున్న విద్యార్థుల మధ్య వివాదానికి కారణంగా చెబుతున్నారు.. మాటామాట పెరగడంతో ఘర్షణకు దారితీసింది.. ఇద్దరు విద్యార్థుల మధ్య గొడవ పెరగడంతో రాజానగరం చెందిన లోడగాల ఉదయ్ శంకర్ అనే విద్యార్థి అదే తరగతిలో చదువుతున్న తూర్పు గానుగూడెంకు చెందిన పింక్ హరి సాయి అనే మరొక విద్యార్థిపై దాడి చేశాడు. కత్తితో పొడిచాడు.. ఉపాధ్యాయులు అంతా ఉండగానే ఎగ్జామ్ హాల్ లో ఈ ఘటన జరిగింది.. ఊహించని ఘటనతో హరి సాయి కుప్పకూలిపోయాడు.. రక్తపు మడుగులో పడిపోయాడు.. ఇక, హుటాహుటిన రాజమండ్రిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు టీచర్లు… ఈ మేరకు పోలీసులకు సమాచారం అందించారు. హాస్పటల్ లో హరిసాయికి వైద్యులు శస్త్ర చికిత్స చేస్తున్నారు. కానీ, 9వ తరగతి విద్యార్థులు ఓ అమ్మాయి కోసం దాడికి దిగడం చర్చగా మారింది.