Civil Supply Corruption : వనపర్తి జిల్లాలో సివిల్ సప్లై అవినీతి అక్రమాలపై చీఫ్ విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు . సియం ఆర్ ధాన్యం మాయం, నిర్మాణాలు పూర్తి కాని రైస్ మిల్లులకు ధాన్యం కేటాయింపు . డిఫాల్ట్ రైస్ మిల్లులకు ధాన్యం కేటాయింపులపై మూడు రోజులుగా విచారణ కొనసాగుతోంది . జిల్లాలో పనిచేస్తున్న సివిల్ సప్లై అధికారి , పౌర సరఫరాల శాఖ మేనేజర్, ఎన్ ఫోర్స్ మెంట్ డిటి లను హైదరాబాద్ లోని కార్యాలయానికి పిలింపించి విజిలెన్స్ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. 2023 నుంచి ఇప్పటి వరకు జిల్లాలో పనిచేసిన, ప్రస్తుతం పనిచేస్తున్న అధికారులను , కింది స్థాయి ఉద్యోగులను సైతం పిలిపించి విచారిస్తున్నారు. వనపర్తి జిల్లాలోని ఖిల్లాఘనపురం , పెబ్బేరు , కొత్తకోట , పానగల్ , వనపర్తి ప్రాంతాల్లో ఉన్న రైస్ మిల్లుల్లో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగినట్లు, అక్రమార్కులకు సివిల్ సప్లై అధికారుల అండదండలున్నట్లు ఫిర్యాదులు రావడం తో విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.
Hindupur: హిందూపురంలో ఉత్కంఠకు తెర.. టీడీపీ కౌన్సిలర్ రమేష్ మున్సిపల్ ఛైర్మన్ గా ఎన్నిక