ప్రపంచం ఉన్నంతకాలం నేరాలు జరుగుతూనే ఉంటాయి.. నేరం చేసిన వాడికి శిక్ష తప్పదు.. కానీ శిక్ష అనేది న్యాయబద్ధంగా ఉంటుంది.. న్యాయం జరిగే నాటికి బాధితులు ఉంటారో ఉండరో తెలియదు.. ఇప్పుడు అంతా ఇన్స్టెంట్ కాలం ఈ కాలంలో ఏదైనా ఫాస్ట్ గా జరిగిపోవాలి.. అప్పుడే సమాజంలోని అందరూ సాటిస్పై అవుతారు.. నేరాలు చేస్తారు.. తప్పించుకొని పోతారు.. నాలుగు గోడల మధ్యలో ఉండిపోతారు.. కొన్నాళ్లకు బెయిల్ వస్తుంది.. బయటకు వస్తారు మళ్ళీ సమాజంలో తిరుగుతారు.. అంతేకాదు నేరాలు చేస్తూ పోతూ ఉంటారు అయితే వీళ్లకు శిక్ష ఎప్పుడు పడుతుంది అనేది అందరూ ఎదురు చూస్తారు. శిక్ష పడుతుంది.. శిక్షకాలం పూర్తవుతుంది.. మళ్లీ సమాజంలోకి వస్తారు.. ఏపీలో ఇప్పుడు ఇన్ స్టెంట్ న్యాయం జరుగుతుంది అంటే నేరం చేసిన కొన్ని గంటల్లోనే బాధ్యతుడికి న్యాయం చేసే ప్రక్రియ. ఇది పౌర సమాజం ఒప్పుకోదు.. కానీ ఇప్పుడున్న యువతరం మాత్రమే ఒప్పుకుంటుంది.. ఇలాంటి ఇన్ స్టెంట్ తీర్పే కావాలని కోరుకుంటుంది.
Also Read:NZ vs ENG: ఫోర్లు, సిక్సర్ల వర్షం.. టీ20 మ్యాచ్‌లో 407 పరుగులు!
అప్పుడెప్పుడో హైదరాబాద్ శివారు ప్రాంతంలో దిశ రేప్ అండ్ మర్డర్ సమయంలో పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చింది.. నేరస్తులకు శిక్ష వేయాలి ..ఉరిశిక్ష వేయాలి.. లేదంటే ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ వచ్చింది.. ప్రజల డిమాండు ఎలా ఉన్నప్పటికీ కూడా సీన్ రీ కన్స్ట్రక్షన్ చేసే సమయంలో నిందితులు పోలీసులపై తిరగబడి వాళ్ల తుపాకులు లాక్కొని కాల్పులు జరపడం తర్వాత పోలీసులు ప్రాణ రక్షణ కోసం వాళ్లపై కాల్పులు జరుపుకుంటూ చనిపోయారు.. ఆ తర్వాత అప్పుడు పోలీసులకు భ్రహ్మరథం పట్టారు ..సరైన నిర్ణయం తీసుకున్నారని పొగడారు.. అది అక్కడ వరకు బాగానే ఉంది.. ఆ తర్వాత కొన్నాళ్లకు దానిపై ఒక కమిటీ వేయడం జరిగింది ..దాని తర్వాత ఒక కమిషన్ వచ్చింది.. ఎన్కౌంటర్ ఎందుకు చేశారు అంటూ అప్పటి అధికారులను నిలదీశారు.. అధికారుల ప్రవర్తన తప్పు పట్టారు.. అంతేకాదు చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే ఎలా అంటూ కమిషన్ తప్పు పట్టింది.. పోలీసులపై కేసులు నమోదు అయ్యాయి.. దిశా ఎన్కౌంటర్ చేసిన అధికారులు ఇప్పుడు కమిషన్ సుప్రీంకోర్టుల చుట్టూ తిరుగుతున్నారు..
అంతకుముందు గ్యాంగ్ స్టర్ నయీమ్ ఎన్కౌంటర్ చేశారు ఆ సమయంలో కూడా ప్రజలు పోలీసులకు బ్రహ్మరథం పట్టారు. సమాజాన్ని పట్టి పీడించడం కాకుండా చీడపురుగుల తయారయ్యి వేధించడంతో అప్పటి ప్రభుత్వం నయీమ్ ని ఎన్కౌంటర్ చేయించింది.. సమాజం నుంచి అప్పుడు విపరీతమైన స్పందన వచ్చింది.. చాలామంది బాధితులు రోడ్డుపైకి వచ్చారు.. చాలామంది ఫిర్యాదులు చేశారు.. ఇన్నాళ్లు కబంధహస్తాల్లో ఉండిపోయాము ఇప్పటికి మాకు న్యాయం జరిగిందంటూ పోలీసుల ఎదుట వచ్చి చెప్పుకున్నారు.. కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులను తోపాటు పెద్ద ఎత్తున నగదుని అధికారులు సీజ్ చేశారు.. అదే మాదిరిగా హైదరాబాదులో అజీజ్ రెడ్డి ఇతను కూడా ఒక గ్యాంగ్ స్టర్.. ఇతను విఐపి లను బెదిరించి డబ్బులు వసూలు చేస్తాడు ముఖ్యంగా సినీ పరిశ్రమతో పాటు వ్యాపారవేత్తలను బెదిరింపులతో పాటుగా కిడ్నాప్ చేసి డబ్బులు వసూలు చేస్తాడు ఎవరైతే డబ్బులు ఇయ్యరో వాళ్లపైన కక్షకడతాడు. వాళ్ల మీద తీవ్రస్థాయిలో దాడులకు తెగబడతాడు ఇతను పాకిస్తాన్ వరకు వెళ్లి ఐయస్ ఐ లో శిక్షణ పొంది వచ్చాడు..
ఆ తర్వాత అదే ఐ ఎస్ ఐ కి వ్యతిరేకంగా పనిచేశారు.. ముంబై ముంబై మాఫియా కి ఇతను ఒక డాన్ గా ఎదిగాడు.. హైదరాబాద్ సిటీలో మకామేసి తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించాలని ప్రయత్నించిన సమయంలో పోలీసులు ఇతన్ని ఎన్కౌంటర్ చేశారు.. హైదరాబాదులో రాయలసీమ రౌడీల హల్చల్ ఎక్కువగా ఉండేది. అజీజ్ రెడ్డి తిరుపతిరెడ్డి లీడర్ గా ఉండేవాడు. అలాంటి తిరుపతిరెడ్డిని కూడా పోలీసులు హైదరాబాద్ నగర నడి బోడ్డున ఎన్కౌంటర్ చేశారు.. ఏకంగా బేగంపేట ఎయిర్పోర్ట్ లోనే ఎన్కౌంటర్ జరిగింది .ఆ తర్వాత రాయలసీమ రౌడీలు హైదరాబాద్ నుంచి పరారయ్యారు..
వరంగల్ లో కాలేజ్ విద్యార్థి పైన ఆసిడ్ దాడి జరిగింది.. ప్రేమించే లేదన్న కారణంతో దాడి చేశాడు ప్రియుడు.. అమ్మాయి చావు బతుకుల మధ్యకు వెళ్ళిపోయింది.. అప్పుడు కూడా పౌర సమాజం నుంచి డిమాండ్ వచ్చింది.. దాడి చేసిన వాళ్లని పట్టుకునే క్రమంలో పోలీసులు ఎన్కౌంటర్లో యాసిడ్ దాడి చేసిన వాళ్ళు చనిపోయారు..ఇకపోతే తాజాగా కరుడుగట్టిన నేరస్థుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.. నేరసుడు తమకు ఎదురుపడ్డాడు .ఇద్దరు కానిస్టేబుల్ దొంగను పట్టుకున్నారు. అతన్ని టూ వీలర్ మీద తీసుకెళ్తూ ఉండంగా తన దగ్గర ఉన్న పదునైన కత్తితో ఒక కానిస్టేబుల్ ని కిరాతకంగా చంపి పారిపోయాడు.
Also Read:Harassment:వీడు మనిషి కాదు మానవ మృగం.. పక్కనే కూర్చుని కూతురు వయసున్న బాలికపై దారుణం(వీడియో)
రెండు రోజులపాటు పోలీసులు అతని కోసం గాలించారు. చివరికి ఓ ప్రాంతంలో ఉన్నాడని తెలిసి పోలీసులు వెళ్లి పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తే మళ్ళీ దాడి చేశాడు. పోలీసులు కాల్పులు జరిపారు. గాయపడిన నిందితుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తూ ఉంటే తిరిగి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అప్పుడు కూడా పోలీసులపై దాడికి తెగబడి ఆస్పత్రిలో ఉన్న పేషెంట్లు వాళ్ళు బంధువులు పోలీస్ పై ఫైరింగ్ చేస్తానంటూ బెదిరించాడు. దీంతో పోలీసులు కాల్పులు జరిపి అతన్ని చంపేశారు.. తీవ్ర నేరాలు చేసిన వాళ్ల పైన పౌర సమాజం నుంచి చాలా వరకు డిమాండ్లు వస్తూ ఉంటాయి. అందుకు అనుగుణంగా పోలీసులు వ్యవహరిస్తూ ఉంటారు.
