Man Loses Eye: షాకింగ్.. ఈగను చంపి కన్ను కోల్పోయిన వ్యక్తి!
- చైనాలో దారుణం
- ఈగను చంపి కన్ను కోల్పోయిన వ్యక్తి
- తడి-చీకటి ప్రదేశాలలో డ్రైన్ ఫ్లై
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China Man Loses Eye after fly on face: చైనాలోని షెన్‌జెన్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన ముఖంపై వాలిన ఈగను చంపి.. ఏకంగా కంటినే కోల్పోయాడు. కంటికి అయిన ఇన్ఫెక్షన్.. మెదడుకు చేరే అవకాశం ఉండడంతో.. తప్పనిసరి పరిస్థితిలో ఎడమ కనుగుడ్డును తొలగించాల్సి వచ్చింది. ఈ మేరకు సౌత్ చైనా మార్నింగ్ తమ నివేదికలో పేర్కొంది. మెయిన్‌ల్యాండ్ నివేదికలు ఆ కీటకాన్ని డ్రైన్ ఫ్లైగా గుర్తించాయి. అది అత్యంత ప్రమాదకర కీటకం అని తెలిపాయి.
గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని షెన్‌జెన్‌లో వూ అనే వ్యక్తి ముఖంపై ఈగ వాలుతూ ఇబ్బంది పెట్టింది. విసుగు చెందిన అతడు ఆ ఈగను చంపేశాడు. ఈగను చంపిన ఓ గంట తరువాత అతని ఎడమ కన్ను ఎర్రగా మారింది. తీవ్ర నొప్పి రావడంతో వైద్యులను సంప్రదించాడు. సీజనల్ కంజక్టివిటిస్‌తో బాధపడుతున్నట్లు వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. చికిత్స చేసినప్పటికీ.. కంటి చుట్టుపక్కల ప్రాంతంలో పుండుగా ఏర్పడింది.
Also Read
మెడిసిన్స్ తీసుకున్నా వూ పరిస్థితి మరింత దిగ జారింది. కంటి ఇన్‌ఫెక్షన్ మరింత పెరుగుతుందని వైద్యులు గుర్తించారు. వు మెదడుకు ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందుతుందని.. ఎడమ కనుగుడ్డును వైద్యులు తిలగించారు. అతడు కంటి చూపు పోవడానికి డ్రైన్ ఫ్లై అని తేలింది. దాని యొక్క లార్వా నీటిలోనే నివసిస్తుందని సమాచారం. స్నానపు గదులు, వంటశాలలు, సింక్‌లు వంటి.. తడిగా, చీకటిగా ఉండే ప్రదేశాలలో ఇది నివసిస్తుందట. కీటకాలు కంటి వద్దకు వచ్చినపుడు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు ప్రజలకు హెచ్చరిస్తున్నారు.
తాజావార్తలు
-
PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
-
Gurnoor Brar: 17 ఏళ్ల వయసులో క్రికెట్ ప్రారంభం.. 9 ఏళ్ల కష్టానికి టీమిండియా పిలుపు..
-
Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
-
Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
-
Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!