NTV Telugu Site icon

Man Loses Eye: షాకింగ్.. ఈగను చంపి కన్ను కోల్పోయిన వ్యక్తి!

Man Loses Eye

Man Loses Eye

China Man Loses Eye after fly on face: చైనాలోని షెన్‌జెన్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన ముఖంపై వాలిన ఈగను చంపి.. ఏకంగా కంటినే కోల్పోయాడు. కంటికి అయిన ఇన్ఫెక్షన్‌.. మెదడుకు చేరే అవకాశం ఉండడంతో.. తప్పనిసరి పరిస్థితిలో ఎడమ కనుగుడ్డును తొలగించాల్సి వచ్చింది. ఈ మేరకు సౌత్ చైనా మార్నింగ్ తమ నివేదికలో పేర్కొంది. మెయిన్‌ల్యాండ్ నివేదికలు ఆ కీటకాన్ని డ్రైన్ ఫ్లైగా గుర్తించాయి. అది అత్యంత ప్రమాదకర కీటకం అని తెలిపాయి.

గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని షెన్‌జెన్‌లో వూ అనే వ్యక్తి ముఖంపై ఈగ వాలుతూ ఇబ్బంది పెట్టింది. విసుగు చెందిన అతడు ఆ ఈగను చంపేశాడు. ఈగను చంపిన ఓ గంట తరువాత అతని ఎడమ కన్ను ఎర్రగా మారింది. తీవ్ర నొప్పి రావడంతో వైద్యులను సంప్రదించాడు. సీజనల్ కంజక్టివిటిస్‌తో బాధపడుతున్నట్లు వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. చికిత్స చేసినప్పటికీ.. కంటి చుట్టుపక్కల ప్రాంతంలో పుండుగా ఏర్పడింది.

Also Read: Poco F6 Deadpool Edition: ‘పోకో’ నుంచి లిమిటెడ్ ఎడిషన్‌ స్మార్ట్‌ఫోన్‌.. ‘డెడ్‌పూల్’ థీమ్‌ అదిరిపోయిందిగా!

మెడిసిన్స్ తీసుకున్నా వూ పరిస్థితి మరింత దిగ జారింది. కంటి ఇన్‌ఫెక్షన్‌ మరింత పెరుగుతుందని వైద్యులు గుర్తించారు. వు మెదడుకు ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందుతుందని.. ఎడమ కనుగుడ్డును వైద్యులు తిలగించారు. అతడు కంటి చూపు పోవడానికి డ్రైన్ ఫ్లై అని తేలింది. దాని యొక్క లార్వా నీటిలోనే నివసిస్తుందని సమాచారం. స్నానపు గదులు, వంటశాలలు, సింక్‌లు వంటి.. తడిగా, చీకటిగా ఉండే ప్రదేశాలలో ఇది నివసిస్తుందట. కీటకాలు కంటి వద్దకు వచ్చినపుడు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు ప్రజలకు హెచ్చరిస్తున్నారు.