NTV Telugu Site icon

Chandrababu Interrogation: రాజమండ్రి సెంట్రల్ జైలులో రెండో రోజు చంద్రబాబును విచారిస్తున్న సీఐడీ

Cid

Cid

స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని రెండో రోజు సీఐడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. కోర్ట్ ఆదేశాల ప్రకారం విచారణకు ముందు చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్యాధికారుల సమక్షంలో వైద్య పరీక్షలు చేశారు. సెంట్రల్ జైలు కాన్ఫరెన్స్ హాలులో చంద్రబాబును సీఐడీ అధికారులు విచారణ చేస్తున్నారు. చంద్రబాబు తరపున ఇద్దరు న్యాయవాదులు హాజరయ్యారు. ఇక, చంద్రబాబు రెండో రోజు విచారణ నేపథ్యంలో రాజమండ్రి సెంట్రల్ జైలు ఆవరణలో పోలీసుల ఆంక్షలు విధించారు. జైలు చుట్టుపక్కల పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు.

Read Also: Kushi: అక్టోబర్ 1 నుంచి ఓటీటీలోకి వచ్చేస్తుంది…

అయితే, సీఐడీ అధికారులు విచారిస్తున్న సమయంలో చంద్రబాబు పక్కనే ఆయన తరపు న్యాయవాదులు లక్ష్మీనారాయణ, శ్రీనివాస్ ఉన్నారు. విచారణ సమయంలో చంద్రబాబుకు 10 మీటర్ల దూరంలో అడ్వకేట్లు ఉండనున్నారు. ఈ స్కిల్ స్కాం కేసులో మొత్తం రూ.371 కోట్ల కుంభకోణం జరిగిందనీ సీఐడీ అధికారులు ఆరోపిస్తున్నారు. నిన్న చంద్రబాబు చెప్పిన ఆన్సర్స్ ను బట్టి.. సీఐడీ అధికారులు కొత్త ప్రశ్నావళిని రెడీ చేసుకున్నట్లు తెలుస్తుంది.

Read Also: Biggest Cucumber: ప్రపంచంలోనే అతిపెద్ద దోసకాయ.. మోయాలంటే ఇద్దరు మనుషులు కావాలి

ఇవాళ చంద్రబాబును సూటిగా సీఐడీ అధికారులు మరిన్ని ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఈ ప్రశ్నలకు వచ్చే ఆన్సర్స్ ను బట్టి.. ఆయన్ని మరిన్ని రోజులు కస్టడీలోకి తీసుకోవాలా లేకా, ఇక్కడితో విచారణ ముగించాలానేది నేటి సాయంత్రం సీఐడీ నిర్ణయం తీసుకోనుంది. మరిన్ని రోజులు ప్రశ్నించాలి అనుకుంటే, మరోసారి కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోర్టును సీఐడీ అధికారులు కోరే అవకాశం ఉంది. దీంతో నేటి సాయంత్రానికి చంద్రబాబు నాయుడి రిమాండ్ అదనపు గడువు ముగుస్తుంది. దీంతో రేపు( సోమవారం) చంద్రబాబుని సీఐడీ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏసీబీ జడ్జి ముందు ప్రవేశ పెడతారు. రిమాండ్ పొడిగించాలా వద్దా అనే దానిపై జడ్జి నిర్ణయం తీసుకుంటారు. చంద్రబాబు బెయిల్ కోసం దాఖలైన పిటిషన్లను కోర్టు రేపు ఎంక్వైరీ చేయనుంది. అలాగే చంద్రబాబుపై అమరావతి రాజధాని రింగ్ రోడ్డు స్కాం కేసు, ఫైబర్ నెట్ స్కాం కేసుల్లో సీఐడీ అధికారులు దాఖలు చేసిన పీటీ వారెంట్లపై కూడా రేపే విచారణ చేయనుంది.