CI Nagaraju-SIT: సాయికృష్ణ హత్య కేసు.. సిట్ విచారణకు సహకరించని సీఐ నాగరాజు!
- సాయికృష్ణ హత్య కేసు దర్యాప్తులో కీలక పరిణామాలు
- సిట్ విచారణకు సహకరించని సీఐ నాగరాజు
- కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టు సిద్ధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CI Nagaraju Questioned for 8 Hours in Sai Krishna Murder Case: విజయవాడలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ హత్య కేసు దర్యాప్తులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో అరెస్టైన సీఐ నాగరాజును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సుమారు ఎనిమిది గంటలపాటు సుదీర్ఘంగా విచారించింది. సిట్ విచారణకు సీఐ ఏమాత్రం సహకరించలేదట. విచారణ అనంతరం నాగరాజును వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
సిట్ విచారణలో ప్రధానంగా సీసీటీవీ ఫుటేజ్‌లు, కేసుకు సంబంధించిన కీలక సాక్ష్యాల తారుమారు అంశాలపై సీఐ నాగరాజును సిట్ ప్రశ్నించినట్లు సమాచారం. అయితే సిట్ బృందం అడిగిన ప్రశ్నలకు నాగరాజు సహకరించలేదని, పలువురు అంశాలపై మౌనం పాటించినట్లు తెలుస్తోంది. దీంతో రిమాండ్ అనంతరం కస్టడీ పిటిషన్ దాఖలు చేసి మరింత లోతుగా విచారించాలని సిట్ భావిస్తున్నట్లు సమాచారం. నాగరాజు అరెస్టు నేపథ్యంలో అతని మద్దతుదారులు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా విజయవాడ ప్రభుత్వాసుపత్రి, పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అదనపు బలగాలను మోహరించి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
Also Read
- AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
- Pushpa Srivani Arrest: అక్రమంగా అరెస్ట్ చేశారు.. పోలీసుల తీరుపై మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఆగ్రహం!
- IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
- Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
మరోవైపు సాయికృష్ణ హత్య కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టును సిట్ అధికారులు సిద్ధం చేస్తున్నారు. వైద్య పరీక్షలు పూర్తైన అనంతరం సీఐ నాగరాజును న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు సమాచారం. ఉదయం 11 నుంచి 12 గంటల మధ్య అతడిని కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సాయికృష్ణ హత్య కేసులో నాగరాజు పాత్రపై ఇప్పటికే అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, సిట్ దర్యాప్తు మరింత కీలకంగా మారింది. రాబోయే రోజుల్లో కస్టడీ విచారణకు అనుమతి లభిస్తే కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని దర్యాప్తు వర్గాలు భావిస్తున్నాయి.
తాజావార్తలు
-
Rana Daggubati: చిన్న థియేటర్లతో రానా కొత్త ప్రయోగం.. ‘ది అసెంబ్లీ రూమ్స్’తో ఇండిపెండెంట్ సినిమాలకు బూస్ట్!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
Pushpa Srivani Arrest: అక్రమంగా అరెస్ట్ చేశారు.. పోలీసుల తీరుపై మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఆగ్రహం!
-
MYSAA : రష్మిక పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘మైసా’ రిలీజ్ డేట్ లాక్
-
Kayadu Lohar: హ్యాట్రిక్ ఫ్లాప్స్.. అయినా కయాదును వదలని ఇండస్ట్రీ.. అసలైన పరీక్ష సెప్టెంబర్‌లోనే!
ట్రెండింగ్
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!