NTV Telugu Site icon

CI Harrassment: ఇదే పని సారూ.. ఆస్తికోసం తల్లిదండ్రులకు సీఐ చిత్రహింసలు

Ci Nageshwar Reddy

Ci Nageshwar Reddy

CI Harrassment: చట్టాన్ని కాపాడేవాడు.. చట్టాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే తాను దానిని సరి చేసేవాడు.. ఎవరైనా తప్పు చేస్తే శిక్షించే స్థాయిలో ఉన్నవాడు.. ఇక అతనే తప్పు చేస్తే ఎవరికి చెప్పాలి.. ఇప్పుడు ఆ తల్లిదండ్రులకు వచ్చిన కొత్త సమస్య ఇది.. ఆస్తి పంపకాలలో ఇన్స్పెక్టర్ అయినా కొడుకు తప్పుగా వ్యవహరిస్తుంటే ఎవరికి చెప్పాలో తల్లిదండ్రులకు అర్థం కాలేదు. కష్టపడి కొడుకుని పోలీసు అధికారి చేశారు.. 30 ఎకరాల ఆస్తిలో సగం ఆస్తి ఇచ్చేందుకు తల్లిదండ్రులు ఒప్పుకున్నారు.. మిగతా ఆస్తిని మరో కుమారుడు కూతురు లకు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు.. అయితే ఇన్స్పెక్టర్ స్థాయిలో ఉన్న పెద్ద కుమారుడు కి ఇది నచ్చలేదు.. అంతేకాదు ఆస్తి పంపకాలలో తనకు వాటా పెద్దగా ఇవ్వాలని వాదించాడు ..సగానికంటే ఎక్కువ తనకు వాటా ఇవ్వకపోతే ఇబ్బందులకు గురి చేస్తానని చెప్పాడు.. చెప్పిన విధంగానే ఇన్స్పెక్టర్ అయినా కొడుకు తల్లిదండ్రులను వేధించడం మొదలుపెట్టాడు.

Read Also: Kanjara Gang: కరుడుగట్టిన కంజర గ్యాంగ్ ఆట కట్టించిన సంగారెడ్డి పోలీసులు

కొడుకుని కష్టపడి చదివిస్తే తమనే కొట్టి బయటకి గెంటి వేశారని ఆవేదన వ్యక్తం చేశారు.. ఆస్తికోసం పోలీస్ అధికారి స్థాయిలో ఉన్న తన కొడుకే తమను ఇంటి నుంచి బయటకి గెంటివేసారని వాపోయారు.. తమకు న్యాయం చేయాలని ఏకంగా డిజిపి కార్యాలయంలో వాపో పోయారు.. పోలీస్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న తన కొడుకు అక్రమంగా వ్యవహరిస్తున్నారని, ఆస్తి పంపకాలలో తనకు పెద్ద వాటా కావాలని డిమాండ్ చేస్తూ, తమని ఇబ్బంది చేయడమే కాకుండా ఇంటి నుంచి గెంటి వేశారని వరంగల్ జిల్లాకు చెందిన దంపతులు డిజిపి నీ కలిసి ఫిర్యాదు చేశారు .. అంతేకాకుండా కని పెంచిన తమని తమ కుమారుడు కొట్టాడని డిజిపి కి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతానికి మల్టీ జోన్ 2లో రాచకొండ పరిధిలో నాగేశ్వర్ రెడ్డి పనిచేస్తున్నాడు.. ఆస్తి కోసం తల్లిదండ్రులను కొట్టిన సీఐ నాగేశ్వర్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని కోరారు..తన కొడుకు నుండి రక్షణ కల్పించాలని డీజీపీకి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.

వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండలం వెంకటాయింపల్లి గ్రామానికి చెందిన రఘునాధ్ రెడ్డి, బొజ్జమ్మ దంపతుల పెద్ద కొడుకు నాగేశ్వర్ రెడ్డి సీఐ, చిన్నకొడుకు యాదయ్య కానిస్టేబుల్, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు..పెద్ద కొడుకు నాగేశ్వర్ రెడ్డి రాచకొండ కమిషనరేట్ మల్టీ జోన్ 2లో సీఐగా విధులు నిర్వహిస్తున్నాడు. రఘునాధ్ రెడ్డి తన ఆస్తి 30 ఎకరాల 23 గుంటలలో పెద్దకొడుకు పేరుపై 15 ఎకరాలు, చిన్న కొడుకు పేరుపై 11 ఎకరాలు, మిగతా భూమి కూతుళ్లకు ఇద్దామని నిర్ణయం తీసుకున్నాడు. 15 ఎకరాల భూమి తీసుకున్న పెద్ద కొడుకు సీఐ నాగేశ్వర్ రెడ్డి ఇంకో 5 ఎకరాలు కావాలని తల్లిదండ్రులను కొడుతూ, హింసిస్తున్నాము మొదలుపెట్టారు.. అంతేకాకుండా తన తమ్ముని కూడా చిత్రహింసలకు గురి చేయడం ప్రారంభించాడు. దీంతో తమ్ముడు ఆత్మహత్యాయత్నానికి కూడా చేశాడు. దీంతో తమ పెద్ద కొడుకు నాగేశ్వర్ రెడ్డి నుండి తమకు ప్రాణహాని ఉందని, అతని నుండి రక్షణ కల్పించి, అతనిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీకి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.