ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్. రాజశేఖర్‌రెడ్డి రాజకీయ చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మూవీ ‘యాత్ర’.ఈ చిత్రాన్ని మహి వీ రాఘవ్ తెరకెక్కించారు.ఈ సినిమా 2019 ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల సమయం లో విడుదల అయి మంచి విజయం సాధించింది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రంలో వై ఎస్ ఆర్ పాత్రలో మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి అద్భుతంగా నటించారు. ఇదిలా ఉంటే తాజాగా ‘యాత్ర’ మూవీకి కొనసాగింపు గా ‘యాత్ర 2’ మూవీని మహి వీ రాఘవ్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం వైఎస్ఆర్ తనయుడు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితం లో చోటుచేసుకున్న ఘటనల ఆధారంగా తెరకెక్కుతుంది. సీఎం జగన్మోహన్ రెడ్డి పాత్రలో కోలీవుడ్ యాక్టర్ జీవా నటిస్తున్నాడు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి మోషన్ పోస్టర్‌తో పాటు, టీజర్‌ను కూడా విడుదల చేయగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇదిలా వుంటే తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ మ్యూజికల్ అప్‌డేట్ ఇచ్చారు.ఈ మూవీ నుంచి ‘చూడు నాన్న లిరికల్ వీడియో సాంగ్ ను మేకర్స్ విడుదల చేశారు. జగన్ చేపట్టిన ఓదర్పుయాత్ర నేపథ్యంలో ఈ పాట ఉండగా ఫుల్ ఎమోషనల్ గా ఈ పాట సాగింది. భాస్కరభట్ల ఈ పాటకు సాహిత్యం అందించగా.. సంతోష్ నారాయణన్ సంగీతాన్ని సమకుర్చాడు.వైఎస్. రాజశేఖర్‌రెడ్డి మరణాంతరం ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్న రాజకీయాలు, కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్ బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టడం, జగన్ జైలుకు వెళ్లడం ఇలా 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ లో జరిగిన రాజకీయాల చుట్టూ ఈ సినిమా సాగనుంది. ఈ పొలిటికల్ థ్రిల్లర్ సినిమాను త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్, శివ మేక సంయుక్తంగా నిర్మిస్తున్నారు.’యాత్ర 2′ సినిమా ను 2024 ఫిబ్రవరి 08న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రయూనిట్ తెలిపింది.