Site icon NTV Telugu

AP CM YS Jagan: ముఖ్యమంత్రి జగన్‌ను కలిసిన క్రైస్తవ ప్రతినిధులు

Ap Cm Ys Jagan

Ap Cm Ys Jagan

AP CM YS Jagan: తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో క్రైస్తవ ప్రతినిధులతో సీఎం వైయస్‌ జగన్‌ సమావేశమయ్యారు. ముఖ్యమంత్రితో పలు అంశాలపై క్రైస్తవ ప్రతినిధులు చర్చించారు. డీబీటీ వల్ల చివరి లబ్ధిదారునకూ పథకాలు అందుతున్నాయని ప్రతినిధులు వెల్లడించారు. పాస్టర్లకూ గౌరవవేతనం ఇచ్చి సహాయకారిగా నిలిచారని వారు కొనియాడారు. బరియల్‌ గ్రౌండ్స్‌ సమస్యను పరిష్కరించాలని, చర్చి ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని క్రైస్తవ సంఘాల ప్రతినిధులు సీఎంను కోరారు. చర్చిల ఆధ్వర్యంలోని స్కూళ్ళు, సేవా భవనాలకు మున్సిపల్‌ పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలన్నారు. జిల్లా కేంద్రాల్లో కమ్యూనిటీ హాళ్లను నిర్మించాలని కోరారు. దళిత క్రైస్తవుల రిజర్వేషన్లకు మద్దతు ఇవ్వాలని వారు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. మతం మారినంత మాత్రాన పేదరికం పోదని క్రైస్తవ ప్రతినిధులు పేర్కొన్నారు.

Also Read: AP CM Jagan: నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి ఆపన్నహస్తం

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ.. “దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలని అసెంబ్లీలో ఇది వరకే తీర్మానం చేసి కేంద్రానికి పంపించాం. ఈ అంశం న్యాయ స్ధానం పరిధిలో ఉంది శ్మశాన వాటికలపై ఇప్పటికే నివేదికలు తెప్పించుకున్నాం. లేని చోట ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చాం. సచివాలయాల వారీగా ఎస్సీలకు శ్మశాన వాటికలు లేనిచోట ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.” అని సీఎం జగన్‌ క్రైస్తవ ప్రతినిధులకు తెలిపారు.

Exit mobile version