NTV Telugu Site icon

Christian Oliver Dies: కరేబియన్‌ సముద్రంలో కూలిన విమానం.. హాలీవుడ్‌ నటుడు మృతి!

Christian Oliver Died

Christian Oliver Died

Actor Christian Oliver dies in Plane Crash: జర్మన్ సంతతికి చెందిన ప్రముఖ హాలీవుడ్‌ నటుడు క్రిస్టియన్ ఒలివర్‌ విమాన ప్రమాదంలో మరణించారు. ఒలివర్‌ సహా అతడి ఇద్దరు కుమార్తెలు విమాన ప్రమాదంలో మరణించారు. ఈ ప్రమాదంలో పైలట్‌ కూడా మృతి చెందాడు. సమాచారం అందుకున్న కోస్ట్‌గార్డ్‌ సిబ్బంది మత్స్య కారులతో కలిసి మృతదేహాలను బయటికి తీశారు. వెకేషన్‌కు వెళుతుండగా ఈ విమాన ప్రమాదం సంభవించింది. ఒలివర్‌ మరణంతో హాలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

వివరాల ప్రకారం… వెకేషన్‌లో భాగంగా గురువారం క్రిస్టియన్ ఒలివర్‌ (51) తన కుటుంబంతో కలిసి గ్రెనడైన్స్‌లోని బెక్వియా ద్వీపం విమానాశ్రయం నుంచి సెయింట్ లూసియాకు వెళ్తున్నారు. బెక్వియాలో టేక్‌ఆఫ్‌ అయిన కొద్దిసేపటికే విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. దాంతో విమానం కరీబియన్‌ సముద్రంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఒలివర్ (51), అతని కుమార్తెలు అన్నీక్ (10) మడితా క్లెప్సర్ (12) మరియు విమానం పైలట్‌ రాబర్ట్ సాక్స్ మృతి చెందారు.

Also Read: AUS vs PAK: వార్నర్ ఆఖరి పంచ్.. పాకిస్తాన్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం! సిరీస్‌ క్లీన్‌స్వీప్‌

సమాచారం అందుకున్న కోస్ట్‌గార్డ్‌ సిబ్బంది మత్స్య కారుల సాయంతో మృతదేహాలను వెలికితీశారు. పడవ ద్వారా స్థానిక మార్చురీకి మృతదేహాలను తరలించారు. వీరి మరణానికి ఖచ్చితమైన కారణాలను గుర్తించడానికి శవపరీక్షలు శుక్రవారం జరిగాయి. అవి ఇంకా బయటికి రావాల్సి ఉంది. ఇక ‘ది గుడ్ జర్మన్’ అనే సినిమాతో ఒలివర్‌ వెండితెరకు పరిచయమయ్యారు. 2008లో యాక్షన్-కామెడీ చిత్రం ‘స్పీడ్ రేసర్‌’లో నటించారు. కెరీర్‌ ప్రారంభంలో టీవీ షోలు చేసిన ఒలివర్‌.. ఇప్పటివరకు 60కిపైగా సినిమాల్లో నటించారు. 30 ఏళ్ల కెరీర్‌లో టామ్ క్రూజ్ మరియు జార్జ్ క్లూనీలతో కలిసి సినిమాల్లో నటించారు. ఇటీవలే ఆయన ‘ఫరెవర్ హోల్డ్ యువర్ పీస్’ సినిమా చిత్రీకరణను పూర్తి చేశారు.

Show comments