Site icon NTV Telugu

Chris Woakes: జట్టు విజయం కోసం ఇంగ్లాండ్ ప్లేయర్ సాహోసోపేత నిర్ణయం.. కానీ చివరకు!

Chris Woakes

Chris Woakes

Chris Woakes: భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య జరిగిన ఐదో టెస్ట్‌ మ్యాచ్‌ క్రికెట్‌ చరిత్రలో ఓ అత్యద్భుతమైన సంఘటనకు వేదికైంది. ఆఖరి రోజు ఉత్కంఠ భరితంగా సాగుతున్న మ్యాచ్‌లో గెలుపు కోసం ఇంగ్లండ్‌కు కేవలం 18 పరుగులు మాత్రమే అవసరంగా ఉన్న సమయంలో… 11వ ఆటగాడిగా వచ్చిన క్రిస్ వోక్స్‌ ఎంట్రీ ఇప్పుడు అందరినీ షాక్‌కు గురిచేస్తోంది. దీనికి కారణం లేకపోలేదు. అదేంటంటే.. అతడి భుజం విరిగినా.. జట్టు గెలుపు కోసం… వోక్స్‌ ఒక్క చేతిలో బ్యాట్‌ పట్టుకుని బరిలోకి దిగడం అబ్బురపరిచేలా చేసింది.

Upasana : ఉపాసనకు కీలక బాధ్యతలు ఇచ్చిన సీఎం రేవంత్..

అలాంటి పరిస్థితులలో వోక్స్‌ పూర్తి స్థాయిలో బ్యాట్ చేయలేకపోయినా, స్ట్రైక్‌ను రొటేట్‌ చేస్తూ జట్టును గెలిపించేందుకు ప్రయత్నించాడు. కానీ, దురదృష్టవశాత్తు భారత్ బౌలర్లు ముఖ్యంగా సిరాజ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ మాయాజాలం ముందు అతని శ్రమ ఫలించలేదు. ఇంగ్లండ్‌ 367 పరుగులకు ఆలౌట్ కావడంతో భారత్‌ 6 పరుగుల తేడాతో విజయం సాధించగా, సిరీస్‌ను 2-2తో సమం చేసింది.

Hyd Rains : హైదరాబాద్‌లో ఈదురుగాలులతో భారీ వర్షం.. నగరమంతా జలమయం

ఇకపోతే, ఇదే సిరీస్‌లో గత టెస్ట్ మ్యాచ్ లో భారత్‌ ఆటగాడు రిషభ్ పంత్ కూడా పాదం ఫ్రాక్చర్ అయినా, జట్టు కోసం బరిలోకి దిగిన విషయం అందరికీ తెలిసిందే. మొత్తానికి క్రిస్ వోక్స్ ప్రయత్నం… మ్యాచ్‌ను గెలిపించలేకపోయినా.. చిరస్థాయిగా నిలిచిపోయాలా ఒంటి చేత్తో బ్యాటింగ్ కు వచ్చాడు.

Exit mobile version