NTV Telugu Site icon

Chocolate Milk Shake: టేస్టీ చాక్లేట్ మిల్క్ షేక్ ను ఇలా తయారు చేసుకోండి..

Chocolate Milk Shake

Chocolate Milk Shake

వేసవి కాలం వచ్చిందంటే చాలు జనాలు చల్లని పానీయాలను తాగడానికి ఇష్ట పడతారు.. ఇక పిల్లలు కూడా అదే విధంగా తాగుతారు.. పిల్లలు ఎక్కువగా మిల్క్ షేక్ లను ఇష్టపడతారు.. అయితే బయట తీసుకోవడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు ఏంటో వాళ్లకు తెలియదు.. ఆ మాటకొస్తే మనకు కూడా వాటి గురించి పెద్దగా తెలియదు.. ఇక అందుకే సమ్మర్ లో ఎక్కువగా వీటినే అందరు తాగుతున్నారు.. టేస్ట్ తో ధర కూడా ఎక్కువగానే ఉంటుంది..చాలా మంది వీటిని ఎంతో ఇష్టంగా తాగుతారు. ఇకపై బయట కొనుగోలు చేసే అవసరం లేకుండా మన ఇంట్లోనే మనకు సులభంగా లభించే పదార్థాలతో ఈ చాక్లెట్ మిల్క్ షేక్ ను తయారు చేసుకోవచ్చు.. ఇంట్లోనే ఈ మిల్క్ షేక్ ను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

కావల్సిన పదార్థాలు..

కాచి చల్లార్చిన పాలు – ఒక కప్పు,

పంచదార – 2 టేబుల్ స్పూన్స్,

కొకొ పౌడర్ – ఒక టేబుల్ స్పూన్,

చాక్లెట్ కేక్ – 2 టేబుల్ స్పూన్స్,

వెనీలా ఐస్ క్రీమ్ – 2 స్కూన్స్..

తయారీ విధానం :

ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో పాలను తీసుకొని కాచి చల్లార్చి ఫ్రిజ్ లో పెట్టాలి.. అలా పాలు బాగా కూల్ అయ్యాక ఒక మిక్సీ జార్ లోకి తీసుకోవాలి..తరువాత ఇందులో పంచదార, కొకో పౌడర్, చాక్లెట్ కేక్, వెనీలా ఐస్ క్రీమ్ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత దీనిని ఒక గ్లాస్ లో పోసి పైన చాకో చిప్స్, తురిమిన చాక్లెట్, కలర్ ఫుల్ స్ప్రింకిల్స్ తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి.. అంతే బయట దొరికే టేస్ట్ తో ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.. చాక్లేట్ అంటే చిన్నా పెద్దా అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఇష్టంగా తాగుతారు..బయట కొనుగోలు చేసే పని లేకుండా ఇలా ఇంట్లోనే మిల్క్ షేక్ ను తయారు చేసుకోండి.. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చెయ్యండి..

Show comments