Thangalan: రూ.100 కోట్ల చేరువలో చియాన్ విక్రమ్ ‘తంగలాన్’
- రూ.100 కోట్ల మార్క్ చేరువలో 'తంగలాన్'
- ఈ నెల 30న హిందీలో విడుదల కానున్న చిత్రం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thangalan: విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ హీరోగా నటించిన భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘తంగలాన్’ ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని సాధించింది. చియాన్ విక్రమ్ కెరీర్‌లో26 కోట్ల రూపాయల బిగ్గెస్ట్ ఓపెనింగ్ డే కలెక్షన్స్ అందుకుంది. కొత్త మూవీస్ రిలీజ్ అవుతున్నా ‘తంగలాన్’ సినిమా సెకండ్ వీక్‌లో తమిళనాడు, ఏపీ, తెలంగాణ అంతటా స్ట్రాంగ్ హోల్డ్‌తో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ సినిమా తాజాగా 100 కోట్ల రూపాయల కలెక్షన్స్ మార్క్‌కు చేరుకోనుంది. ఈ నెల 30న నార్త్ లో “తంగలాన్” రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు తంగలాన్ చిత్రం హిందీ వెర్షన్ రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ మేరకు ‘బంగారు వీరుడు ఉత్తర భారత దేశానికి ఆగస్టు 30న వస్తున్నాడు. ఈ ఎపిక్ స్టోరీని చూసి ఆనందించేందుకు సిద్ధంగా ఉండండి’ అంటూ పోస్ట్ పెట్టారు.
Read Also: Mathu Vadalara 2: ‘మత్తు వదలరా 2’ రిలీజ్ డేట్ ఫిక్స్
Also Read
రెండో వారంలో ‘తంగలాన్’ సినిమాకు తెలంగాణ, ఏపీలో అదనంగా 141 థియేటర్స్ పెరిగాయి. ఈ మూవీకి పా రంజిత్ దర్శకత్వం వహించాడు. నీలమ్ ప్రొడక్షన్స్‌తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. ఈ సినిమాలో పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించి మెప్పించారు. భారీ అంచనాల మధ్య ఈ నెల 15న తెలుగుతో పాటు తమిళం, కన్నడ భాషల్లో విడుదలైన సంగతి తెలిసిందే. ‘తంగలాన్’ సినిమా భారీ నిర్మాణ విలువలు, చియాన్ విక్రమ్ అద్భుత నటనతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తోంది. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..