తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ వరుస సినిమాలతో దూకుడుగా ఉన్నాడు.. ఒక సినిమా విడుల అవ్వక ముందే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.. డిఫరెంట్ కథలతో జనాలను ఆకట్టుకుంటూ వస్తున్నాడు.. సినిమాలోని పాత్ర కోసం ఆయన పడే కష్టం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు.. తమిళ్లోనే కాదు.. తెలుగులో కూడా విక్రమ్ కు మంచి ఫాలోయింగ్ ఉంది.. అందుకనే ఆయన నటించిన సినిమాలు తమిళంలోనే కాకుండా తెలుగులోనూ విడుదల అవుతుంటాయి.. తాజాగా మరో కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు..
ఎస్.యు.అరుణ్‌కుమార్ దర్శకత్వంలో విక్రమ్ ఓ సినిమాలో నటిస్తున్నారు. విక్రమ్ కెరీర్‌లో ఇది 62వ సినిమా. చియాన్ 62 వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ను శనివారం వీడియో రూపంలో మేకర్స్ తెలియజేశారు. ఈ వీడియోలో పోలీస్ స్టేషన్‌లోకి వచ్చి మరీ విక్రమ్.. ఇద్దరు వ్యక్తులను కొడుతూ కనిపించారు.. ఇక విక్రమ్ ఏడో చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు..
బలమైన కథాంశంలో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు అర్థం అవుతోంది. జీవి ప్రకాశ్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ సినిమాపై అంచనాలను పెంచే విధంగా ఉంది. ఈ వీడియో వైరల్‌గా మారింది.. విక్రమ్ రంజిత్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతూన్న తంగలాన్ సినిమాలో నటిస్తున్నారు. కోలార్ బంగారు గనుల కార్మికుల జీవిత కథల ఆధారంగా కొన్ని వందల ఏళ్ళ క్రితం జరిగిన ఒక కథని తీసుకోని ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఇక ఈ మూవీలోని విక్రమ్ లుక్స్ చూసి సినిమా పై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇది విక్రమ్ కెరీర్‌లో 61వ సినిమా. మాళవిక మోహనన్ హీరోయిన్‌గా నటిస్తుండగా స్టూడియో గ్రీన్ బ్యానర్ నిర్మిస్తోంది… వచ్చే ఏడాది జనవరి 26 న విడుదల కానుంది..
