NTV Telugu Site icon

MLA Arani Srinivasulu: వైసీపీకి షాక్.. జనసేనలోకి మరో ఎమ్మెల్యే..

Arani

Arani

Janasena party: అధికార వైసీపీ ( YCP )కి వరుస షాక్స్ తగులుతున్నాయి. చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్ ( MLA Arani Srinivas ) ఇవాళ జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. ఆయనకి జనసేన కండువా కప్పి పార్టీలోకి పవన్ కళ్యాణ్ ఆహ్వానించారు. ఆరణి శ్రీనివాస్ నేతృత్వంలో జనసేనలోకి చిత్తూరుకు చెందిన పలువురు వైసీపీ నేతలు చేరారు. ఈ సందర్భంగా ఆరణి శ్రీనివాస్ మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంలో నేను ఎన్నో అవమానాలకు గురయ్యాను అని చెప్పుకొచ్చారు. నేను వైసీపీ బాధితుణ్ని.. బలిజ సామాజిక వర్గం నుంచి నేనొక్కడ్నే ఎమ్మెల్యేను.. కానీ నన్ను వైసీపీ అవమానించింది.. పవన్ కళ్యాణ్ ప్రజల కోసమే తపిస్తారు.. పవన్ ఒక్కో మాట.. ఒక్కో తూటా.. వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నా.. పవన్ కళ్యాణ్ విధానాలు ఆకర్షించాయని చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్ పేర్కొన్నారు.

Read Also: Gorantla Butchaiah Chowdary: రాజమండ్రి రూరల్ నుంచి టీడీపీ అభ్యర్థిగా నేనే పోటీ చేస్తా..

ఇవాళ్టి నుంచి పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) తో నడుస్తా అంటూ చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్ వెల్లడించారు. రాయలసీమలో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తాను అని పిలుపునిచ్చారు.రాయలసీమలోనే కాదు.. గ్రేటర్ రాయలసీమలో నేను జనసైనికులతో ( Janasena party ) కలిసి నడుస్తా.. జనసైనికులు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నా.. పవన్ కోసం పార్టీ కోసం పని చేస్తున్నారు అని ఆయన చెప్పుకొచ్చారు. పవన్ నన్ను బావిలో దూకమంటే దూకడానికి కూడా సిద్దంగా ఉన్నాను అని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్ వెల్లడించారు.