NTV Telugu Site icon

Road Accident: చిత్తూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి, 13 మందికి గాయాలు!

Accident

Accident

చిత్తూరు శివారు ప్రాంతం గంగాసాగరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున ఆగివున్న టిప్పర్‌ను ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సులోని నలుగురు ప్రయాణికులు అక్కడిక్కడే మృతి చెందారు. మరో 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను వేలూరు సీఎంసీ, నరివి ఆస్పత్రులకు తరలించారు.

ట్రావెల్స్‌ బస్సు తిరుపతి నుంచి మధురై వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం అనంతరం 20 అడుగులు జారుకుంటూ రోడ్డు నిర్మాణం జరుగుతున్న ప్రదేశంలోని కరెంట్ పోల్‌ను బస్సు ఢీకొట్టింది. కరెంటు పోల్ బస్సులోకి చొచ్చుకుపోవడంతో.. నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ప్రభుత్వాసుపత్రికి వెళ్లి ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లను కలెక్టర్ ఆదేశించారు.