NTV Telugu Site icon

Chittoor MP Reddeppa: కుప్పంకి నీళ్లివ్వలేని ఘనత చంద్రబాబుది

Mp Reddeppa

Mp Reddeppa

మాజీ సీఎం చంద్రబాబునాయుడిని టార్గెట్ చేశారు వైసీపీ నేతలు. ఈసారి ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబుని ఓడించేందుకు పకడ్బందీ వ్యూహంతో ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు వైసీపీ నేతలు. సీఎం జగన్ కూడా అదే వ్యూహంతో ముందుకెళుతున్నారు. చిత్తూరు ఎంపీ ఎన్ రెడ్డప్ప చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు చేశారు. లోకేష్ పరామర్శలు కోసం వచ్చి సిఎం జగన్ పై, మంత్రి పెద్దిరెడ్డి పై విమర్శలు చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మళ్ళీ వైసిపి అధికారం చేపట్టడం ఖాయం అన్నారు ఎంపీ రెడ్డప్ప.

Read Also: Union Minister Kishan Reddy: టీఆర్ఎస్‌ను, కల్వకుంట్ల కుటుంబాన్ని ఎవరూ కాపాడలేరు.

చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ జగన్ కాలి గోటికి సరిపోరు.. కుప్పం ఎక్స్ ఎమ్మెల్యే గా చంద్రబాబు మిగిలిపోతారని ఎద్దేవా చేశారు. మంత్రి పెద్దిరెడ్డి జగన్ ఆదేశాల మేరకు కుప్పం లో అడుగు పెట్టారో, ఆ రోజే చంద్రబాబు పతనం ప్రారంభమైంది. ఇది కాలేజ్ నుండి పెద్దిరెడ్డి ను చూస్తున్న చంద్రబాబు కు తెలుసు. పుంగనూరు పుడింగి అని విమర్శిస్తున్న చంద్రబాబు, లోకేష్ పుంగనూరు అత్యంత అభివృద్ధి చెందిన విషయం అని తెలుసుకోవాలన్నారు ఎంపీ రెడ్డప్ప. జగన్ మోహన్ రెడ్డి కుప్పం మున్సిపాలిటీ అబివృద్దికి 66 కోట్లు మంజూరు చేశారు.

మున్సిపాలిటీకి 66 కోట్లు ఖర్చు చేస్తే ఇంక చంద్రబాబు కు ఓటు వేయరు అనే భయం. పెద్దిరెడ్డి, జగన్ మోహన్ రెడ్డిని చూసి చంద్రబాబు, లోకేష్ భయబ్రాంతులకు గురవుతున్నారు. 33 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉండి కుప్పం కు నీళ్ళు ఇవ్వలేని దుస్థితి చంద్రబాబు ది అని మండిపడ్డారు.

Read Also: APSRTC MD Dwaraka TirumalRao: ప్రగతిపథంలో ఏపీఎస్ఆర్టీసీ