NTV Telugu Site icon

Chittoor Court: తల్లి బిడ్డల హత్య, మైనర్‌ కూతురిపై అత్యాచారం.. కోర్టు సంచలన తీర్పు

Chittoor Court

Chittoor Court

Chittoor Court: కామాంధులు రెచ్చిపోతున్నారు.. కన్నుమిన్ను కానకుండా.. చిన్నాపెద్ద తేడా లేకుండా.. తమ పశువాంఛ తీర్చుకుంటున్నారు.. తల్లి బిడ్డలతో అక్రమ సంబంధమే కాదు.. వారిని హత్య చేసిన ఉన్మాది ఆ తర్వాత మైనర్‌ బాలికపై సైతం అఘాయిత్యానికి పాల్పడ్డాడు.. వాడి పాపం పండింది.. తల్లి బిడ్డలను హత్య చేసి ఆపై వారి మైనర్ కూతురిని అత్యాచారం చేసిన నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది చిత్తూరు ఏడీజే కోర్టు..

Read Also: Nandamuri Balakrishna: ఇదిరా.. ఒకప్పుడు టాలీవుడ్

ఈ కేసు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉమ్మడి చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి మండలంలో తల్లి బిడ్డను హత్య చేసిన నిందితుడు మౌలాలికి ఉరి శిక్ష విధిస్తూ మంగళవారం సంచలన తీర్పు వచ్చింది.. గంగిరెడ్డిపల్లికి చెందిన తల్లి బిడ్డలు సరళమ్మ, గంగులమ్మలను అదే ఊరికి చెందిన సయ్యద్ మౌలాలి అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.. అయితే, ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో తల్లీ బిడ్డలను దారుణంగా హత్య చేసి చంపేశాడు. అంతటితో ఆగకుండా వారి మైనర్ కూతురిపై కన్నేసిన ఉన్మాది.. ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.. ఈ కేసును చిత్తూరు ఏడిజెక్టివ్ న్యాయమూర్తి రమేష్ మంగళవారం నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించారు.. ఈ కేసును గవర్నమెంట్ తరఫున ఏపీపీ లోకనాథరెడ్డి వాదించారు. కాగా, కన్నుతూరిపై అత్యాచారం చేసి గర్భవతిని చేసిన కేసులో నిన్న విశాఖ పోక్సో కోర్టు దోషికి జీవిత ఖైదు విధించి.. రూ.10 లక్షలు జరిమానా విధించగా.. ఈ రోజు చిత్తూరు కోర్టు మరోకేసులో ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది.