Site icon NTV Telugu

Vishwambhara: ఇట్స్ అఫీషియల్.. చిరంజీవి ‘విశ్వంభర’ వచ్చేది ఎప్పుడంటే!

Vishwambhara Release Date

Vishwambhara Release Date

Vishwambhara Release date Out: మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా, బింబిసార ఫేమ్‌ వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘విశ్వంభర’. ఈ చిత్రంను యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌ రూపొందిస్తోంది. కీరవాణి మ్యూజిక్ అందిస్తోన్న ఈ సినిమాలో అనుష్క శెట్టి, మృణాల్ ఠాకూర్‌ నటించనున్నారనే వార్తలు వస్తున్నాయి. చిరంజీవి నటిస్తున్న 156వ సినిమా కోసం ఫ్యాన్స్‌ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. విశ్వంభర సినిమా విడుదల తేదీని తాజాగా చిత్ర యూనిట్ ప్రకటించింది.

సంక్రాంతి కానుకగా 2025 జనవరి 10న విశ్వంభర సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ‘అతీత శక్తుల పోరాటం నుంచి లెజెండ్స్‌ అవతరిస్తారు’ అని పవర్‌ఫుల్‌ పోస్టర్‌ను యూవీ క్రియేషన్స్‌ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే విశ్వంభర చిత్రీకరణ ప్రారంభమైంది. అయితే చిరంజీవి ఇంకా సెట్స్‌లోకి అడుగు పెట్టలేదు.

Also Read: Mumbai Bomb Threat: ముంబైకి బాంబు బెదిరింపులు.. ఆరు చోట్ల బాంబులు పెట్టామని..!

విశ్వంభర సినిమా కోసం మెగాస్టార్‌ చిరంజీవి జిమ్‌లో వర్కౌట్స్‌ చేస్తున్న వీడియోను తాజాగా షేర్‌ చేశారు. అందులో రెడీ ఫర్‌ విశ్వంభర అంటూ ఫుల్‌ జోష్‌లో చిరు చెప్పారు. దీంతో మెగాస్టార్‌ విశ్వంభర సెట్స్‌లోకి త్వరలోనే అడుగు పెట్టనున్నారని తెలిసింది. ఈ వారంలో మొదలయ్యే కొత్త షెడ్యూల్‌లో చిరు పాల్గొననున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఓ భారీ సెట్‌ను మేకర్స్‌ ఏ‍ర్పాటు చేశారు.

Exit mobile version