NTV Telugu Site icon

Chiranjeevi: ఆయన మరణం తీవ్ర మనోవేదనకు గురిచేసింది: చిరంజీవి

Chiranjeevi

Chiranjeevi

ప్రముఖ రాజకీయవేత్త, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణం పట్ల టాలీవుడ్ ‘మెగాస్టార్’ చిరంజీవి సంతాపం వ్యక్తం చేశారు. ఐదు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో ఉన్న ఏచూరి కన్నుమూశారనే వార్త తనను తీవ్ర మనోవేదనకు గురిచేసిందని చిరు ట్వీట్ చేశారు. ప్రజలకు చేసిన సేవ, దేశం పట్ల ఆయన నిబద్ధత ఎప్పటికీ గుర్తుండిపోతుందని పేర్కొన్నారు. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌తో ఢిల్లీ ఎయిమ్స్‌లో కొద్ది వారాలుగా చికిత్స పొందిన సీతారాం ఏచూరి ఆరోగ్యం విషమించడంతో గురువారం తుదిశ్వాస విడిచారు.

Also Read: VENOM Telugu Trailer: ‘వెనమ్‌: ది లాస్ట్‌ డ్యాన్స్‌’ తెలుగు ట్రైలర్‌ విడుదల.. వేట‌గాడే వేటాడ‌బ‌డితే!

‘ఐదు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో ఉన్న ప్రముఖ నాయకుడు, సీపీఎం అగ్రనేత శ్రీ సీతారాం ఏచూరి కన్నుమూశారనే వార్త తీవ్ర మనోవేదనకు గురిచేసింది. విద్యార్థి కార్యకర్త స్థాయి నుంచి అణగారిన, సామాన్య ప్రజల గొంతుగా ఆయన చేసిన కృషి మరువలేనిది. ఈ విషాద సమయంలో సీతారాం కుటుంబానికి, ఆయన అభిమానులకు, సీపీఎం సోదర వర్గానికి నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నా. సీతారాం చేసిన ప్రజా సేవ, దేశం పట్ల నిబద్ధత ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆయనను చాలా మిస్ అవుతాం’ అని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’లో నటిస్తున్నారు. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి విశ్వంభర విడుదల కానుంది.