Site icon NTV Telugu

Chiranjeevi : తండ్రిని గుర్తుచేసుకుని ఎమోషనల్ అయిన మెగాస్టార్ చిరంజీవి

Chiranjeevi

Chiranjeevi

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి తండ్రి వెంకటరావు పుట్టినరోజు డిసెంబర్ 24. ఈ సందర్భంగా చిరు తన తండ్రిని టచ్ చేస్తూ సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. మాకు జన్మనిచ్చి, క్రమశిక్షణతో పెంచి, జీవితంలోని ఒడిదుడుకులపై అవగాహన కల్పించి, మా ప్రయత్నాలకు ఎల్లవేళలా తోడ్పాటునందిస్తూ, విజయాలు సాధించేలా స్ఫూర్తిగా నిలిచిన మా నాన్న వెంకటరావుగారిని స్మరించుకుంటున్నాము’ అని ట్వీట్ చేశారు.ఈ సందర్భంగా కొన్ని ఫొటోలను కూడా షేర్ చేశారు. తన తండ్రి వర్ధంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆయనను స్మరించుకున్నారు. తన తండ్రికి తల్లి అంజనాదేవి, సోదరుడు నాగబాబు, తన సోదరీమణులతో కలిసి ఆయన నివాళి అర్పించారు. తన తండ్రి ఫోటోకు పూలమాల వేసి దీపం వెలిగిస్తున్న ఫోటోను కూడా షేర్ చేశాడు. కాగా, మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వాల్తేరు వీరయ్య చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది.

Exit mobile version