MSVG: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం “మన శంకర్ వరప్రసాద్ గారు” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుష్మితతో పాటు సాహు గారపాటి కూడా నిర్మిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా రిలీజ్ ప్లాన్ చేయబడిన ఈ సినిమా అనౌన్స్ చేసిన నాటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. దానికి కారణం అనిల్ రావిపూడి కామెడీ టైమింగ్ అనే చెప్పాలి. ఎందుకంటే, గతంలో ఆయన చేసిన అన్ని సినిమాలు కామెడీ టైమింగ్‌తోనే వర్కౌట్ అయ్యాయి. దానికి తోడు, చివరిగా ఆయన చేసిన విక్టరీ వెంకటేష్ సినిమా, సంక్రాంతికి వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఏకంగా 300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.
READ ALSO: Jogi Ramesh: జోగి రమేష్ అనే నేను.. తప్పు చేయలేదు, తప్పు చెయ్యను!
ఈ నేపథ్యంలో, మెగాస్టార్ టైమింగ్‌తో పాటు అనిల్ రావిపూడి కామెడీ టైమింగ్ కూడా సింక్ అయితే, ఈ సినిమాని ఆపేవారే లేరని ప్రచారం. ఈ నేపథ్యంలో సినిమా బిజినెస్ కూడా హాట్ కేకులా పూర్తయినట్లుగా సమాచారం. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ తోనే సినిమా బడ్జెట్ అంతా కవర్ అయిపోయినట్లుగా తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో సినిమాల నాన్ థియేటర్ బిజినెస్ గాలిలో దీపంలా మారిపోతున్న తరుణంలో, ఏకంగా షూటింగ్ దశలో ఉండగానే నాన్ థియేట్రికల్ పూర్తి చేసుకోవడం అనేది ఒక ఆసక్తికరమైన పరిణామం అనే చెప్పాలి. ఈ సినిమా డిజిటల్ రైట్స్ జీ సంస్థ దక్కించుకున్నట్లుగా సమాచారం. నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది.
READ ALSO: Krithi Shetty : పిట్ట కొంచం కూత ఘనం.. కృతి శెట్టి లేటెస్ట్ ఫొటోస్
