NTV Telugu Site icon

Bhola Shankar: రాజశేఖర్ స్టైల్ లో చిరంజీవి.. బాసూ మీరు కూడానా!

Chiranjeevi

Chiranjeevi

Bhola Shankar: యాంగ్రీ యంగ్ మెన్‎గా రాజశేఖర్‎కు ఇండస్ట్రీలో మంచి పేరుంది. ఆయన స్టైలే యూనిక్.. మేనరిజాన్ని చాలామంది అనుకరిస్తుంటారు. వారిలో చిన్న చిన్న రీల్స్ చేసే వారి దగ్గరినుంచి స్టార్ హీరోల వరకు ఉన్నారు. మెగా హీరోలు కూడా ఆయన మేనరిజాన్ని ఫాలో అవుతున్నారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా రాజశేఖర్ మేనరిజాన్ని ఫాలో అయినట్లు తెలుస్తోంది. మెగాస్టార్.. ప్రస్తుతం మెహర్ రమేశ్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అవుట్ అండ్ కమర్షియల్ హంగులతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. చిరు తన గత చిత్రం వాల్తేరు వీరయ్యతో సూపర్ హిట్ కొట్టడంతో తన తాజా సినిమాపై అభిమానుల్లో అంచనాలున్నాయి. చిత్ర బృందం భోళా శంకర్ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసింది. దానికి ప్రేక్షకుల నుంచి హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. ఆ ట్రైలర్ లో చిరు నటించిన ఓ సన్నివేశం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. దీంతో రాజశేఖర్ పేరు కూడా ట్రెండ్ అవుతోంది.

Read Also:Bro OTT: ‘బ్రో’ మూవీ ఏ ఓటిటి లో రిలీజ్ అవుతుందో తెలుసా?

వివరాల్లోకి వెళితే ట్రైలర్లో రాజశేఖర్ మార్క్ డ్యాన్స్ స్టెప్ ఇమిటేట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పుడు ఇదే చర్చనీయాంశమైంది. రాజశేఖర్ స్టైల్ లో చిరంజీవి చేతులు ఊపుతూ డ్యాన్స్ చేస్తున్నారు. ఇది సినిమాకు సంబంధించిన ఓ కామెడీ సీన్లా అనిపిస్తోంది. గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ చిత్రంలోనూ రాజశేఖర్ డ్యాన్స్ ను ఇమిటేట్ చేసి డైలాగ్స్ చెప్పి అదరహో అనిపించారు. కానీ,, అప్పట్లో దీనిపై జీవిత రాజశేఖర్ అసహనం వ్యక్తం చేశారు. రాజశేఖర్ ను అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ ఇప్పుడు మెగాస్టార్ రాజశేఖర్ డ్యాన్స్ ను ఇమిటేట్ చేయం ఎలాంటి వివాదానికి దారి తీస్తుందో చూడాలి. భోళాశంకర్ సినిమా ఆగష్టు 11న రిలీజ్ కానుంది. దీంతో చిత్రయూనిట్ సినిమా ప్రమోషన్లలో జోరు పెంచింది. ట్రైలర్ చూస్తే మాస్ ఎలిమెంట్స్ సినిమాలో పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తోంది. చిరు డ్యాన్స్, ఫైట్స్, ఎలివేషన్స్ సీన్స్, డైలాగ్స్, సాంగ్స్,.. అన్ని సూపర్బ్ గా ఉన్నాయి.

Read Also:BRO Movie Public Talk: ‘బ్రో’ మూవీ పబ్లిక్‌ టాక్‌.. సినిమా ఎలా ఉందంటే..?