మెగా ఫ్యామిలీలో మోస్ట్ క్యూట్ జోడి ఉపాసన రామ్ చరణ్ జంట.. ఈ జంటకు పెళ్ళై పదేళ్లు పూర్తి అయ్యింది..ఈ జంట పెళ్లయి పది సంవత్సరాలు దాటినప్పటికీ కూడా చాలా అన్యోన్యంగా ఒకరి విషయంలో మరొకరు తలదూర్చకుండా అన్ని విషయాల్లో కలిసిపోయి ఇప్పటివరకు ఎలాంటి గొడవలు రాకుండా ఉంటున్నారు… సోషల్ మీడియాలో ఈ జంట ఎప్పుడు ట్రెండింగ్ లో ఉంటుంది..పేదలకు సాయం చెయ్యడంలో ఈ అమ్మడు మామకు తగ్గ కోడలు అనిపించుకుంది.. తనకు తోచిన సాయాన్ని చేస్తూ ప్రశంసలు అందుకుంది..
అయితే గతంలో వీరి గురించి పిల్లల విషయంలో ఎన్నో ట్రోల్స్ వినిపించినప్పటికీ వాటన్నింటిని ఉపాసన, రామ్ చరణ్ లు భరించారు.. ఇక ఇంట్లో కూడా ఒత్తిడి తీసుకొని వచ్చారు. అయితే, వీళ్ళు మాత్రం తమకు నచ్చినట్లే చేసి జీవితంలో సెటిల్ అయ్యాక పిల్లల్ని కన్నారు. అయితే రామ్ చరణ్ ఉపాసన తాజాగా తమ 11వ పెళ్లిరోజుని గ్రాండ్గా జరుపుకున్నారు.. ఈ మేరకు సినీ ప్రముఖులు, కుటుంబ సభ్యులు సోషల్ మీడియా ద్వారా విషెష్ తెలుపుతున్నారు..
రామ్ చరణ్ ఉపాసన దంపతులు జూన్ 14, 2012లో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. ఇక రామ్ చరణ్ ఉపాసన పెళ్లి రోజు కానుకగా చిరంజీవి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారని వార్తలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి.. చిరంజీవి తన కొడుకు కోడలు ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలుపుతూనే.. త్వరలోనే పేరెంట్స్ కాబోతున్న మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు.. పుట్టబోయే బిడ్డతో మీరు ఎప్పటికీ ఇలాగే హ్యాపీగా ఉండాలి.. ఆ దేవుడు చల్లని దీవెనలు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి అంటూ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు.. అలాగే కొడుకు కోడలికి కలిపి డైమండ్ రింగ్స్ పంపించారని తెలుస్తుంది..ఇక తండ్రి, కొడుకులు ఎక్కడా వెనక్కి తగ్గకుండా వరుస సినిమాలను చేస్తున్నారు.. ఇక మెగా వారసుడు కోసం ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..
