Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఫుల్ స్పీడ్ మీద ఉన్నట్లు కనపడుతున్నారు. ప్రస్తుతం రెండు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న చిరు, ఆ తర్వాత చేయబోయే సినిమాపై కూడా క్లారిటీ ఇవ్వడమే కాక, ప్రేక్షకులకు ఓ బిగ్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ‘విశ్వంభర’ వర్క్‌ను పూర్తి చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి, ప్రస్తుతం ‘మన శంకర వరప్రసాద్ గారు’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాలు పూర్తి కాగానే, యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. గతంలో చిరు-బాబీ కాంబినేషన్‌లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఇప్పుడు మరోసారి అదే మ్యాజిక్‌ను రిపీట్ చేసేందుకు ఈ క్రేజీ కాంబో సిద్ధమవుతోంది.
ఈ కొత్త ప్రాజెక్ట్‌లోనూ వర్కౌట్ అయిన ఒక సెంటిమెంట్‌ను రిపీట్ చేయాలని చిరంజీవి, బాబీ భావిస్తున్నట్లు సమాచారం. అదేంటంటే… మల్టీస్టారర్ ఫార్ములా! ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో చిరుతో పాటు మాస్ మహారాజు రవితేజ కీలక పాత్రలో నటించారు. తెరపై ఈ ఇద్దరు స్టార్ల కెమిస్ట్రీకి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. అందుకే చిరు, బాబీ కాంబినేషన్‌లో రాబోయే తదుపరి ప్రాజెక్ట్‌ను కూడా క్రేజీ మల్టీస్టారర్‌గా ప్లాన్ చేస్తున్నారని టాక్. ఈ సినిమాలో చిరంజీవితో కలిసి మరో సూపర్ స్టార్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారని సమాచారం. రవితేజ తర్వాత, ఈసారి చిరుతో కలిసి నటించే ఆ స్టార్ హీరో ఎవరై ఉంటారా అని మెగా ఫ్యాన్స్, సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ బిగ్ సర్ప్రైజ్ ఎప్పుడు బయటపడుతుందో చూడాలి మరి.
Maoist Leader: సీఎం చంద్రబాబుపై అలిపిరి దాడిలో కీలక సూత్రదారి లొంగుబాటు.. ఇంతకీ ఎవరితను..?
అయితే, ఈ మధ్య టాలీవుడ్ కు రెగ్యులర్ గా టచ్ లో ఉంటున్న మోహన్ లాల్ మెగా మూవీలో కీలక పాత్రల్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనేది అప్డేట్. ఇదివరకు మోహన్ లాల్ నటించిన లూసిఫర్ సినిమాను తెలుగులో ‘గాడ్ ఫాదర్’గా రీమేక్ చేశారు మెగాస్టార్. ఇప్పుడు ఇద్దరు కలిసి ఒకే ఫ్రేమ్ లో కనిపించబోతున్నట్లు కూడా ఇండస్ట్రీ సర్కిల్ లో హాట్ టాపిక్ అవుతుంది
