Mega154 : గాడ్ ఫాదర్ తో బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు వాల్తేరు వీరయ్య గా అభిమానుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మాస్ మహారాజ రవితేజ ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. మెగా 154 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పోస్టర్ అలాగే టీజర్లు ఫ్యాన్స్ ను ఉర్రుతలూగించాయి. కాగా దీపావళి పండుగను పురస్కరించుకొని ఈ మూవీ టైటిల్ టీజర్ ను రిలీజ్ చేసింది చిత్రం బృందం.
Read Also: Chicago: ఓ పక్క రయ్..రయ్.. మరో పక్క ఢమాల్.. ఢమాల్.. చికాగోలో షాకింగ్
ఏంట్రా ఆడొస్తే పూనకాలన్నాడు.. అడుగేస్తే అరాచకం అన్నాడు.. ఏడ్రా మీ అన్నయ్య.. సౌండే లేదు.. అంటూ విలన్ చెప్పే డైలాగ్.. రివర్స్ ఆర్డర్‌లో స్క్రీన్ ప్లేని తీసుకెళ్తూ.. బీడీ తాగుతున్న చిరంజీవిని చూపించేశాడు బాబీ. చిరంజీవి మ్యానరిజం, యాటిట్యూడ్ అన్నీ కూడా మెప్పించాయి. ఇలాంటి ఎంటర్టైన్మెంట్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే.. లైక్ షేర్ సబ్ స్క్రైబ్ చేయండి అంటూ చిరు చెప్పిన డైలాగ్ సూపర్బ్ అంతే. బాబి టేకింగ్‌కు.. దేవీ శ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. చివర్లో హ్యాపీ దివాళి.. తొందర్లోనే కలుద్దామంటూ రవితేజ వాయిస్ వినిపించడం హైలెట్.
Read Also: Thangalaan: మరో క్రేజీ పాత్రలో చియాన్ విక్రమ్.. విభిన్న కథనంతో ‘తంగలాన్’
ఈ సినిమాలో చిరంజీవి సరసన శృతి హాసన్ నటిస్తోంది. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ కొట్టే సంగీతం, ఇచ్చే పాటలు హైలెట్ అవ్వనున్నాయని టాక్. మాస్ సాంగ్స్‌తో ఊపు ఊపేస్తాడని సమాచారం. ఆల్రెడీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఏ రేంజ్‌లో ఉండబోతోందో.. నేడు రిలీజ్ చేసిన టైటిల్ టీజర్ చూస్తే తెలుస్తోంది. ఈ సినిమాను సంక్రాంతి బరిలోకి దించేందుకు మైత్రీ మూవీస్ ప్రయత్నిస్తోంది. ఈ సారి సంక్రాంతికి మైత్రి మూవీస్ పోటీ పడుతున్నాయి. ఇటు చిరంజీవి, అటు బాలయ్య సినిమాలతో మైత్రీ మూవీస్ సందడి చేయబోతోంది.