NTV Telugu Site icon

Mega 154 Title Teaser : మాస్ లుక్‎లో చిరు.. కేక పుట్టిస్తున్న స్టైల్

Mega154 First Look Teaser

Mega154 First Look Teaser

Mega 154 Title Teaser : గాడ్ ఫాదర్ సినిమా తర్వాత చిరంజీవి చేస్తున్న సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. దీపావళికి ఈ మూవీ టైటిల్ టీజర్ రిలీజ్ చేస్తామని చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. అదే విధంగా అక్టోబర్ 24న ఉదయం పదకొండు గంటల ఏడు నిమిషాలకు టైటిల్ టీజర్ రిలీజ్ చేయబోతోన్నట్టు ప్రకటించారు. మెగా స్టార్‌ 154 సినిమాకు వాల్తేరు వీరయ్య టైటిల్‌ పెట్టనున్నట్లు టాక్‌. ఇక ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి.. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ బాబి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా మైత్రి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతోంది. ఈ సినిమాలో మాస్‌ మహారాజు రవితేజ కూడా నటిస్తున్నారు.

Read Also: Naga Chaitanya : మైసూర్ వెళ్లొచ్చిన చైతూ-కృతిశెట్టి జోడి

సోమవారం రావాల్సిన టైటిల్ టీజర్ కంటే.. ముందే నేడు ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ అప్డేట్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇందులో దేవీ శ్రీ ప్రసాద్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. టీజర్ డిజైన్, టైటిల్ అన్నీ కూడా అదిరిపోయాయి. చిరంజీవి స్టైల్ అదిరింది.ఇక ఈ ఫస్ట్ గ్లింప్సే ఈ రేంజ్‌లో ఉంటే.. రేపు రాబోతోన్న టైటిల్ టీజర్ ఇంకా పూనకాలు తెప్పించేలా ఉంటుందేమో.

Read Also: OTT Updates: ధనుష్ ‘నేనే వస్తున్నా’ ఓటీటీ డేట్ ఫిక్స్

అసలే మాస్ మూలవిరాట్, పూనకాలు లోడింగ్ అంటూ మొదటి నుంచి ఈ సినిమా మీద హైప్ పెంచేశారు. మాస్ మహారాజా రవితేజను కూడా ఈ ప్రాజెక్టులోకి తీసుకొచ్చారు. చిరంజీవి, రవితేజ కలిసి మాస్ స్టెప్పులు వేయబోతోన్నట్టు తెలుస్తోంది. ఆల్రెడీ దీనికి సంబంధించిన సాంగ్ షూటింగ్ కూడా జరిగిందట. ఈ మూవీని సంక్రాంతి బరిలోకి దించేందుకు మేకర్లు రెడీ అయ్యారు. జనవరి 11న ఈ చిత్రం బరిలోకి దిగనుంది. అయితే బాలయ్య రిలీజ్ చేసినట్టుగానే.. చిరంజీవి కూడా తన సినిమా టైటిల్ టీజర్‌ను రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యాడు.

Show comments