Site icon NTV Telugu

MEGA 158 : చిరు కూతురుగా బాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ సినిమా హీరోయిన్

Mega 158

Mega 158

మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి కానుకగా వచ్చిన మన శంకర వరప్రసాద్ తో భారీ హిట్ అందుకున్నాడు. తన నెక్ట్స్ సినిమాను డైరెక్టర్ బాబీతో చేస్తున్నాడు మెగాస్టార్. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో, ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. కన్నడ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ పై ఈ సినిమాను నిర్మిస్తోంది.  తాజాగా ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం కాస్టింగ్ తుది దశకు చేరుకుంది.

Also Read : Varanasi : వారణాసి 2 పార్ట్స్.. క్లారిటీ ఇచ్చిన రాజమౌళి

అయితే ఈ సినిమాలో చిరంజీవి కూతురి పాత్ర కథలో చాలా కీలకంగా ఉండబోతోందని సమాచారం. ఈ పాత్ర కోసం చాలా మంది పరిశీలించి ఫైనల్ గా  ‘పొన్నియిన్ సెల్వన్’ ఫేమ్ సారా అర్జున్ ను ఖరారు చేశారట మేకర్స్. చైల్డ్ ఆర్టిస్ట్‌గా మెప్పించిన సారా ఇటీవల బాలీవుడ్ లో వచ్చిన ధురంధర్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె నటన మరియు స్క్రీన్ ప్రెజెన్స్ ఈ పాత్రకు సరిగ్గా సరిపోతాయని దర్శకుడు బాబీ ఇటీవల సారాకు కథ వినిపించగా అందుకు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అయితే ఈ పాత్ర కోసం మొదట ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి పేరు కూడా వినిపించింది. అయితే కృతి శెట్టి గత కొంత కాలంగా వరుస ప్లాప్స్ చూసింది. రీసెంట్ గా వచ్చిన వా వతియార్ కూడా డిజాస్టర్ కావడంతోజ్ మేకర్స్ సారా అర్జున్ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.  ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడి కానున్నాయి. మెగాస్టార్ మార్క్ మాస్ ఎలిమెంట్స్‌తో పాటు బలమైన ఎమోషన్స్‌తో ఈ చిత్రాన్ని బాబీ సిద్ధం చేస్తున్నాడు.

Exit mobile version