NTV Telugu Site icon

Chiranjeevi Birthday: శ్రీవారిని దర్శించుకున్న చిరంజీవి దంపతులు!

Chiranjeevi Birthday

Chiranjeevi Birthday

నేడు ‘మెగాస్టార్’ చిరంజీవి పుట్టినరోజు. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. గురువారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో సతీమణి సురేఖతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు చిరంజీవివి స్వాగతం పలికి.. దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేసి.. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

శ్రీవారిని దర్శించుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి బుధవారం రాత్రే రోడ్డు మార్గంలో తిరుమలకు చేరుకున్నారు. మెగాస్టార్ దంపతులతో పాటు చిరు తల్లి అంజనా దేవి, కుమార్తె శ్రీజ, మనవరాలు ఉన్నారు. చిరుకు సంబందించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పుట్టినరోజు సందర్భంగా చిరుకు అభిమానులు విషెష్ తెలియజేస్తున్నారు.

Also Read: Brand Value: కంపెనీల క్యూ.. ఒక్కసారిగా పెరిగిన వినేశ్‌, మను బాకర్‌ సంపాదన!

చిరంజీవి బర్త్ డే సందర్బంగా మెగాస్టార్ నటించిన ‘ఇంద్ర’, ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ చిత్రాలు విడుదల అయ్యాయి. థియేటర్స్ వద్ద ఫాన్స్ సందడి చేస్తున్నారు. ప్రస్తుతం వశిష్ఠ దర్శకత్వంలో చిరు ‘విశ్వంభర’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి సరసన త్రిష, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇవ్వనున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది.

 

Show comments