మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాబోతున్న ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’. ఈ సినిమాలో మరో స్టార్ హీరో వెంకటేష్ కూడా ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. తాజా సమాచారం ప్రకారం, దర్శకుడు అనిల్ రావిపూడి వచ్చే వారం నుంచి సినిమా క్లైమాక్స్‌కు సంబంధించిన ప్యాచ్ వర్క్ షూటింగ్‌ను పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఈ కీలకమైన షూట్‌లో మెగాస్టార్ చిరంజీవితో పాటు ప్రధాన తారాగణం అంతా పాల్గొననుంది. ప్రస్తుతం సినిమా టీమ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా వేగవంతం చేస్తూ, చిత్రాన్ని వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది.
Also Read : Varanasi : రాజమౌళి గ్లోబల్ ప్లాన్ లీక్.. థియేటర్లలో ‘వారణాసి’ టీజర్ ప్లాన్ ?
ఈ వినోదాత్మక చిత్రంపై చిరంజీవి పూర్తి విశ్వాసంతో ఉన్నారు. గతంలో ఆయన మాట్లాడుతూ, ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఒక పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రమని, కథ తనకు ఎంతో నచ్చిందని వెల్లడించారు. అంతేకాక, అనిల్ రావిపూడి సన్నివేశాల గురించి చెబుతున్నప్పుడు తాను కడుపుబ్బా నవ్వుకున్నానని, ఈ సినిమా కచ్చితంగా అభిమానులను అలరిస్తుందని మెగాస్టార్ ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్ట్‌ను సాహు గారపాటి, మరియు చిరంజీవి కుమార్తె సుస్మిత సంయుక్తంగా నిర్మిస్తోంది. ప్రేక్షకులకు ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
