Site icon NTV Telugu

Mana Shankaravaraprasad Garu: మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ లపై అదిరిపోయే మాస్ డ్యాన్స్ సాంగ్..!

Mana Shankaravaraprasad Garu

Mana Shankaravaraprasad Garu

Mana Shankaravaraprasad Garu: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మొస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ “మీసాల పిల్ల” 72 మిలియన్లకుపైగా వ్యూస్ సాధించి, సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేసింది. మరోవైపు ఈ చిత్రంలో చిరంజీవి, విక్టరీ వెంకటేష్ స్క్రీన్‌ను షేర్ చేసుకోవడం ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ కానుంది. ఇకపోతే హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వేయబడిన భారీ సెట్లో చిరంజీవి–వెంకటేష్‌లపై స్టైలిష్ డ్యాన్స్ షూట్‌ను మేకర్స్ ప్రారంభించారు. తొలిసారిగా ఈ ఇద్దరు సూపర్ స్టార్స్ ఓ గ్రాండ్ సెలబ్రేషన్ సాంగ్‌లో కలిసి కనిపించడం విశేషం.

Tamil Nadu: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు బస్సులు ఢీ, 11 మంది మృతి..

భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేసిన ఎనర్జిటిక్ బీట్స్‌తో ఈ పాట మరింత పండగ వాతావరణాన్ని సృష్టించనుంది. 500 మందికిపైగా డ్యాన్సర్లు పాల్గొంటున్న ఈ సాంగ్ పూర్తిగా కలర్‌ఫుల్, రిథమిక్, కార్నివాల్ వైబ్స్‌తో రూపొందుతోంది. ఇద్దరు స్టార్ హీరోల కెమిస్ట్రీ, ఎనర్జీ ప్రేక్షకులను మెప్పిస్తూ సంక్రాంతికి పర్ఫెక్ట్ ఫీస్ట్ ఇవ్వబోతోంది. బ్లాక్ బస్టర్ హిట్ మీసాల పిల్లకు కొరియోగ్రఫీ చేసిన పొలకి విజయ్ ఈ పాటకు కూడా కొరియోగ్రఫీ చేయడం మరో ప్రత్యేకత. త్వరలోనే చిరంజీవి–నయనతారలపై చిత్రీకరించిన ఒక మెలోడియస్ రొమాంటిక్ సాంగ్‌ను విడుదల చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నది.

శ్రద్ధా దాస్ గ్లామర్ షో..అదిరిపోయే హాట్ పోజులు !

షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీమతి అర్చన సమర్పిస్తున్నారు. సినిమాకు సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, తమ్మిరాజు ఎడిటింగ్, ఏ.ఎస్. ప్రకాష్ ఆర్ట్ డైరెక్షన్ అందిస్తున్నారు. ఎస్. కృష్ణ, జి. ఆది నారాయణ కథ–సహరచనలో పాల్గొన్నారు. నరేంద్ర లోగిసా VFX సూపర్‌వైజర్‌గా, నవీన్ గారపాటి లైన్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. అదనపు డైలాగ్స్‌ను అజ్జు మహంకాళి, తిరుమల నాగ్ అందించారు.

Exit mobile version